close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దైవానికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలి

రాష్ట్రపతికి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌ లేఖ

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఆలయాల్లో దైవానికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌ కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీస్వామికి ఒక ప్రతినిధిగా ఆలయాల్లోని స్వామివారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని జులై 18న తాను రాష్ట్రపతికి లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ‘‘సుప్రీంకోర్టు అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజవంశీయులకే అప్పగించింది. అలాగే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుమతించింది. శబరిమలై అయ్యప్ప విషయంలో మాత్రం ధర్మాసనం.. దైవానికి రాజ్యాంగబద్ధంగా ఏ అధికారాలు లేవని తీర్పు చెప్పింది. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశా. ఆలయాల్లో దైవానికి రాజ్యాంగ హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశా’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.