close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భగీరథ పూర్తికి నెలాఖరే గడువు: మంత్రి సబిత


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి, పాల్గొన్న ప్రజాప్రతినిధులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మిషన్‌ భగీరథ అసంపూర్తి పనులన్నింటిని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భగీరథ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జిల్లాలోని 1091 ఆవాసాలకు భగీరథ నీరందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలో 722 గ్రీన్‌, 297 ఆరెంజ్‌, 12 రెడ్‌ గ్రామాలుగా ఉన్నాయని మొత్తం 925 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం చేపడితే 897 పూర్తయ్యాయని తెలిపారు. అన్ని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి సరఫరాకు సంబంధించి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా అదనపు పైపులైన్లు, ఓహెచ్‌ఆర్‌లు అవసరమైతే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజీత్‌రెడ్డి, చేవెళ్ల, కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు కాలేయాదయ్య, నరేందర్‌రెడ్డి, ఆనంద్‌, మహేష్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.