close

బుధవారం, అక్టోబర్ 21, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పందిరి సాగు.. దిగుబడి బాగు

ఎస్సీలకు రాయితీ

అయిదు ఎకరాల లోపు వారికి అవకాశం

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని నగరానికి కూరగాయలు వికారాబాద్‌ జిల్లా నుంచే ఎక్కువగా రవాణా చేస్తారు. మోమిన్‌పేట, నవాబుపేట, వికారాబాద్‌, పూడూరు, ధారూర్‌ తదితర మండలాల నుంచి నగరానికి నిత్యం సరఫరా అవుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తారు. కూరగాయల డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ, బీసీ (సీ) రైతులకు పందిరి విధాన సాగును ప్రోత్సహించనున్నారు. అధునాతనమైన విధానంతో సాగు చేసే పద్ధతులపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఎంపికైన వారికి అవగాహన కల్పిస్తారు.

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు

పందిరి విధానంలో సాగు చేసేందుకు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. తీగజాతి కూరగాయలను సాగు చేసేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసి బీర, సొర, కీరా, టమాటా(తీగజాతి) పొట్ల, దొండ, చిక్కుడు, కాకర, బీన్స్‌, తదితరాలను పండించనున్నారు. హైబ్రిడ్‌ వంగడాలు ఒక సారి వేస్తే మూడు, నాలుగు సార్లు కాత వస్తుంది. దొండకాయ మూడేళ్ల పాటు దిగుబడి వస్తుంది.

* ఈ పథకం కింద గతంలో 2.20 ఎకరాల లోపు ఉన్న రైతులు అర్హులుగా గుర్తించారు. ఈ నిబంధనలను సడలించి అయిదు ఎకరాలలోపు ఉన్నవారికి అవకాశం కల్పించారు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

* కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, భూమి పట్టా పాస్‌పుస్తకం.

* మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, పందిరి సాగు చేయాలనుకున్న భూమిలో బోరు, బావి వద్ద నిల్చొని దిగిన చిత్రం

* ఇతర ప్రతులతో వికారాబాద్‌ జిల్లా కార్యాలయం ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

* పట్టణ ప్రాంత రైతుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు లోపు, గ్రామీణులు వార్షిక ఆదాయం రూ.1.50 లోపు ఉండాలి.

రాయితీ ఇలా

ఈ పథకం కింద లబ్దిదారులకు రూ.3.50 లక్షల విలువ చేసే పందిరి,/కడీలు, తీగ. మెల్చింగ్‌ షీటు, సేంద్రియ ఎరువులు, తైవాన్‌ స్ప్రేయరు, ప్లాస్టిక్‌ ట్రేలు కార్పొరేషన్‌ ద్వారా సరఫరా చేస్తారు. రైతుకు 60 శాతం రాయితీ అంటే రూ.2.10 లక్షలు కార్పొరేషన్‌ సమకూరుస్తుంది. రూ.1.40 లక్షలు బ్యాంకు ద్వారా రుణం అందజేస్తారు.రుణాన్ని వాయిదాలతో చెల్లించాల్సి ఉంటుంది.

గతేడాది 57 మందికి

పందిరి సాగు పథకాన్ని గతేడాది ప్రారంభించి 57 మందికి మంజూరు చేశారు. ఈ సారి 124 మందికి మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చినా మంజూరు చేసేందుకు కార్పొరేషన్‌ సిద్ధంగా ఉంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నిబంధనలు ఇవీ..

* ఎస్సీ, బీసీ(సీ) రైతులు అర్హులు

* ఎకరా పట్టా భూమిలో బోరు/బావి, విద్యుత్తు సౌకర్యం

* పట్టా కలిగిన రైతు వయసు 55 ఏళ్లు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.