close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేరాల పరిశోధనలో సహకరించాలి: సీపీ సజ్జనార్‌
సామాజిక మాధ్యమాల సంస్థలతో వెబినార్‌
 

ప్రసంగిస్తున్న కమిషనర్‌ వీసీ సజ్జనార్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే నేరాల దర్యాప్తులో నిందితుల ఖాతాల వివరాలు, ఇతర కీలక సమాచారాన్ని సకాలంలో అందించి సహకరించాలని.. సదరు సంస్థలకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ సూచించారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం ఆయన వివిధ సామాజిక మాధ్యమాల సంస్థల ప్రతినిధులు, హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసు అధికారులతో వెబినార్‌ నిర్వహించారు. సైబర్‌ నేరాలు, ఫేస్‌బుక్‌ యాడ్‌ సర్వీస్‌ సేవలను వినియోగించుకుని చేస్తున్న మోసాలు, వాటిని నివారించాల్సిన చర్యలపై చర్చించారు. నేర పరిశోధన అధికారులకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా సంస్థలు.. నోడల్‌ అధికారులను నియమించాలని సూచించారు. ప్రతినిధులు ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రాం సంస్థల ప్రతినిధులు, విచారణ అధికారులు తరచూ కార్యశాలలు నిర్వహించి.. సైబర్‌ నేరాల నివారణకు పరస్పర సహకారం అందించుకోవాలని, సైబర్‌ నేరాల వలలో చిక్కకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి, సైబరాబాద్‌ డీసీపీ(క్రైమ్స్‌) రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ కవిత, సైబర్‌ క్రైం ఏసీపీలు శ్యాంబాబు, కేవీఎం ప్రసాద్‌, హరినాథ్‌, ఫేస్‌బుక్‌ నోడల్‌ అధికారి సత్యాయాదవ్‌ పాల్గొన్నారు.

చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల కారాగారం

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఒంటరిగా ఉన్న చిన్నారిని గదిలో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా తొమ్మిదో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి రఘునాథ్‌రెడ్డి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.మంజులాదేవి కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన అరుణ్‌ జాదవ్‌(25) బతుకుదెరువు కోసం వలసొచ్చి లారీడ్రైవరుగా పనిచేస్తూ మేడ్చల్‌జిల్లా దుండిగల్‌ ఠాణా పరిధిలోని ఓ కాలనీలో అద్దెగదిలో ఉంటున్నాడు. అరుణ్‌ 2017లో ఓ చిన్నారి(8)కి చాక్లెట్లు ఇచ్చి మాయమాటలతో మభ్యపెట్టి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.