close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అపార్ట్‌మెంట్‌కు అక్రమ నల్లా

20 మందిపై క్రిమినల్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: జలమండలి అనుమతి లేకుండా ఓ భారీ అపార్ట్‌మెంట్‌కు అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీసుకొని నీటిని వినియోగిస్తున్న వైనం బయట పడింది. డబీర్‌పురా నూర్‌ఖాన్‌బజార్‌లోని మెట్రో క్లాసిక్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద దీనిని గుర్తించారు. మంగళవారం ఈ అక్రమ నల్లాను తొలగించి భవన యజమాని మహమ్మద్‌థాకీతో పాటు ఇతర యజమానులు 20 మందిపై డబీర్‌పురా ఠాణాలో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు జలమండలి ముఖ్య విజిలెన్సు అధికారి రవిచంద్రరెడ్డి తెలిపారు. ఈ తరహా కనెక్షన్లను గుర్తిస్తే 99899 98100 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.