close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంకుల తొలగింపు

 క్రేన్‌ సహాయంతో తొలగిస్తున్న బంకు 

మైదుకూరు, న్యూస్‌టుడే : స్థానిక ఉన్నత పాఠశాల ముందు భాగంలోని బంకులను పుర అధికారులు ఎట్టకేలకు మంగళవారం తొలగించారు. కమిషనర్‌ పీవీ రామకృష్ణ, పట్టణ ప్రణాళిక పర్యవేక్షణాధికారి జిలానిబాషా దగ్గరుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా పాఠశాల ముందు భాగంలోని స్థలం ఆక్రమించి కొందరు బంకులు ఏర్పాటు చేసుకుని దుకాణాలను నిర్వహించారు. మరి కొందరు స్థలాలను బాడుగలకు ఇచ్చారు. పాఠశాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా రూ. కోటి మంజూరు చేసింది. పాఠశాల ముందు భాగంలో విద్యార్థులకు సైకిల్‌ స్టాండ్, మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బంకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ బృందం పుర అధికారులకు విన్నవించటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.