close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పఠనాసక్తి.. సృజనాత్మకతకు పదును

పాఠశాలలకు కథల పుస్తకాలు

3,306 బడులకు త్వరలో చేరిక


పాఠశాలలకు అందించనున్న కథల పుస్తకాలు

కమలాపురం, ఖాజీపేట, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, ఇతర ఆధునిక పద్ధతుల్లో బోధన చేపడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో పఠనాసక్తి పెంచి పాఠశాలల్లో చదువే కాకుండా మానవతా విలువలు, సృజనాత్మకత, సమయస్ఫూర్తి పెంపొందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందు కోసం రకరకాల ప్రభుత్వం కథలు చదివించేందుకు, పఠనాసక్తి పెంపొందించేందుకు జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం కథల పుస్తకాలను అందించి ప్రతి పాఠశాలలో గ్రంథాలయం అభివృద్ధి చెందేలా దోహద పడుతోంది. ఇందు కోసం ఇప్పటికే ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పుస్తకాలు చేరాయి.

జిల్లాలో 2,622 ప్రాథమిక పాఠశాలలు, 714 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ గ్రంథాలయ పుస్తకాలను అందజేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు ఒక్కో బాక్సులో 38 పుస్తకాల చొప్పున 99,636 పుస్తకాలు వచ్చాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 50 పుస్తకాల చొప్పున 35,700 పుస్తకాలు అందించనున్నట్లు అధికారులు చెప్పారు. వీటితో పాటు గణిత మిత్ర కింద గణితానికి సంబంధించిన పరికరాలు ఇప్పటికే 234 పాఠశాలలకు వచ్చినట్లు తెలిపారు.

ప్రతి పాఠశాలలో ఓ మినీ గ్రంథాలయం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. ఉపాధ్యాయుల ఆలోచనలు, వారి సలహాలు, సూచనలతో పుస్తకాలను ఎంపిక చేసి వాటిని పాఠశాలలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కథల పుస్తకాలతో పాటు ఎంతోమంది రచయితలు, ఉన్నత వ్యక్తులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండే వారికి మనోభావాలు, వారు సూచించిన మార్గాలు విద్యార్థుల వికాసానికి దోహదపడతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం

పాఠశాలల్లో కధల పుస్తకాలు అందుబాటులో ఉంచితే వారిలో సృజనాత్మకతతో పాటు, పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాఠశాలల్లో మినీ గ్రంథాలయంలా ఏర్పాటు చేసి వారికి ఈ పుస్తకాలతో పాటు ఇతర మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

- జాఫర్‌సాధిక్‌, బాధ్య ఎంఈవో, కమలాపురం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.