close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గౌరవప్రదంగా వ్యవహరిస్తే మేలు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: సైబర్‌ ప్రపంచంలో ప్రజలందరూ గౌరవప్రదంగా వ్యవహరించాలని సీఐడీ అదనపు డైరెక్టరు జనరల్‌ పీవీ.సునీల్‌కుమార్‌ తెలిపారు. ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ సీఐడీ కార్యాలయం నుంచి నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడారు. జిల్లాలో పలువురు వెబినార్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో చేయాల్సినవి, చేయకూడనివి గుర్తుంచుకుని వ్యవహరించాలని తెలిపారు. విద్వేషపూరిత, అసభ్యకరమైన పోస్టులు, మహిళలను వేధించే పోస్టింగ్‌ పెడితే జైళ్లపాలవుతారని పేర్కొన్నారు. నిజజీవితంలో ఇతరులను ఎలాగయితే గౌరవిస్తామో అదే విధంగా సైబర్‌ ప్రపంచంలో అవతలి వ్యక్తులను కూడా గౌరవించాలన్నారు. ఇతరుల మనోభావాలు, సంప్రదాయాలను కించపరిచే విధంగా పోస్టింగులు ఉండరాదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో మహిళలను వెంటపడడం, వేధించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని తెలిపారు. రెండు సంవత్సరాలు జైలుశిక్ష, మళ్లీ అదే తప్పు చేస్తే ఏడు సంవత్సరాలు జైలుశిక్ష ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.