close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా

ఎస్‌ఈ శ్రీనివాసులు


విద్యుత్తు నియంత్రికను పరిశీలిస్తున్న విద్యుత్తుశాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ రంగానికి పగటి పూటనే 9 గంటలు విద్యుత్తు సరఫరా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్తుశాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని చిన్న కాంపల్లె, నాగిరెడ్డిపల్లె విద్యుత్తు ఉప కేంద్రాల్లో తక్కువ స్థాయి విద్యుత్తు నియంత్రికలను తొలగించి అధిక సామర్థ్యం ఉన్న నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనులను ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల్లో 5 ఎం.వి.ఏ సామర్థ్యం గల నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దశలవారీగా జిల్లా వ్యాప్తంగా ప్రతి 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల్లో నియంత్రికల సామర్థ్యం పెంచుతామన్నారు. దీని ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్తు అందించడమేనన్నారు. డీఈలు జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, ఇన్‌ఛార్జి ఏఈ రఘ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.