close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నియామకాలు


సీఈగా బాధ్యతలు చేపడుతున్న శ్రీరాములుకు అభినందనలు

తెలుపుతున్న ఉద్యోగ సంఘ నాయకులు

ఆప్కో డీఎంగా సోమేశ్వరరావు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: ఆప్కో జిల్లా (డీఎం) అధికారిగా సోమేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కేంద్ర కార్యాలయంలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఈయన్ను ప్రభుత్వం ఈ జిల్లాకు బదిలీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న జగదీశ్వరరావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జిల్లా ఖాదీ గ్రామీణ పరిశ్రమల విభాగం అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్‌కు ఆప్కో డీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈయన విధులు నిర్వర్తిస్తున్నారు.

బాధ్యతల స్వీకరణ

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ ట్రాన్స్‌కో (శంకరాపురం) సీఈగా శ్రీరాములు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్‌ సీఈగా పనిచేస్తూ కడపకు బదిలీపై వచ్చారు. ఈయన గతంలో ఈ జిల్లాలో ఇదే స్థానంలో చాలా ఏళ్లుగా పనిచేస్తూ విజయవాడకు వెళ్లారు. తిరిగి ఆయన ఇదే జిల్లాకు వచ్చారు. సంస్థ పరిధిలో విద్యుత్తు పనుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న దేవానంద్‌ విజయవాడ కన్‌స్ట్రక్షన్‌ సీఈగా బదిలీపై వెళ్లారు. గురువారం బాధ్యతలు చేపట్టిన శ్రీరాములుకు విద్యుత్తు బీసీ ఉద్యోగ సంఘంఘ రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రయ్య, రవీంద్ర, రెడ్డిశేఖర్‌, ప్రసన్న అభినందనలు తెలిపారు.

ఎల్డీఎంగా చంద్రశేఖర్‌

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా లీడ్‌బ్యాంక్‌ (ఎల్డీ) మేనేజరుగా చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా సిండికేట్‌ బ్యాంకులో ఆర్‌ఎంగా పనిచేస్తూ ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. చంద్రశేఖర్‌ ఇదే జిల్లాలోని చెన్నూరు మండల వాసి. శుక్రవారం బాధ్యతలు చేపడుతున్నట్లు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. గురువారం సంబంధిత అధికారులను కలిశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయాచారి రాజమండ్రి సిండికేట్‌ బ్యాంకు ఆర్‌వోగా బదిలీ అయ్యారు. తాజాగా విశాఖ రీజినల్‌ బ్యాంకు డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌గా బదిలీ అయినట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఆంజనేయాచారి ఇక్కడ పనిచేస్తూ బదిలీ అయ్యారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.