close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

శాస్త్రీయ నాట్యం.. అభినయంలో దిట్ట

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

అన్నమాచార్య సంకీర్తనం..

పేరు: శరణ్య, అమ్మ స్వాతి, నాన్న సత్యనారాయణ, సుభాష్‌నగర్‌

శిక్షణ: కూచిపూడి, జానపదంపై శిక్షణ

ప్రత్యేకం: అన్నమాచార్య సంకీర్తనం, జతిస్వరం వంటి వాటిపై అభినయం.

ప్రదర్శనలు: పాఠశాల వార్షికోత్సవం, తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు, వినాయక ఉత్సవాలు, దేవీనవరాత్రి ఉత్సవాలతో పాటు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో నర్తించింది.

ఉత్తమ కళాకారిణిగా..శరణ్య

 

తరగతి గదిలో చదువుతో పాటు నృత్యంలో ఇందూరు చిన్నారులు రాణిస్తున్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. విజయవాడలో జరిగిన అఖిల భారత కూచిపూడి మహాసమ్మేళనంలో పాల్గొని గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులను కైవసం చేసుకున్నారు. జిల్లాకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన నాట్యసమ్మేళనంలో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

నాట్యంలో పురస్కారాలు

పేరు: సాయిశ్రద్ధ, అమ్మ లావణ్య, నాన్న మశ్చెందర్‌, జిల్లాకేంద్రంలోని వినాయక్‌నగర్‌లో నివాసం

శిక్షణ: చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్టం. అభినయ కళాక్షేత్రం శిక్షకురాలు దేవులపల్లి చందన వద్ద శిక్షణ

ఎప్పటి నుంచి: మూడేళ్లుగా కూచిపూడి శాస్త్రీయ నృత్యం సాధన..

జాతీయస్థాయిలో సత్తా.. సాయిశ్రద్ధ

చదువుతో పాటు నృత్యం, సంగీతంలో బాగా సాధన చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉంది. ఉత్తమ నాట్యకారిణిగా పేరు తెచ్చుకుంటా. పేదవారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నాట్యశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా.

 

చిన్నప్పటి నుంచి ఇష్టమైన శాస్త్రీయ నృత్యంలో ఎంఏ చేయాలని ఉంది. నిరంతరం సాధన చేస్తా. అమ్మానాన్నలతో పాటు నాట్యాచార్యులు, పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతో ప్రొత్సహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారిణిగా పేరు సాధిస్తా.

● జిల్లాకేంద్రంలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, కలెక్టరేట్‌, బోధన్‌, ఎడపల్లి, వర్ని, బాసర తదితర ప్రాంతాల్లో నర్తనం. ఇప్పటి వరకు సుమారు 31కు పైగా ప్రదర్శనలు, ● రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌ రవీంద్రభారతి, త్యాగరాయగానసభ వంటి వేదికలపై నాట్య ప్రదర్శనలతో ప్రముఖులతో ప్రశంసలు పొందారు.
ప్రదర్శనలు..

*● మండూకశబ్దం, దశావతార. బ్రహ్మాంజలి, జతిస్వరం వంటి అంశాలపై నర్తిస్తుంది.

*జిల్లాస్థాయిలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, కలెక్టరేట్‌, కొత్త అంబేడ్కర్‌భవన్‌, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఉగాది ఉత్సవం, మహాశివరాత్రి ఉత్సవాల్లో అభినయించింది. ఇప్పటి వరకు 25కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

*2016 డిసెంబరులో విజయవాడలో మహాబృంద నాట్యంలో పాల్గొని గిన్నీసు బుక్‌ ఆఫ్‌ రికార్డును పొందింది.

*2019లో హైదరాబాద్‌లో జరిగిన గోదాదేవి నాట్య సమ్మేళనంలో పాల్గొన్నారు.

*2017 ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ప్రదర్శన

*● 2018లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేదికలపై కూచిపూడి నృత్యం

*● 2019లో గుంటూరు కళానిలయం వేదిక నుంచి నాట్యమయూరి సత్కారం

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.