close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఆర్జీ-2 సేవా ఉత్పత్తులు

యైటింక్లయిన్‌కాలనీ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో సేవా ఉత్పత్తుల విక్రయం, ప్రదర్శన కోసం శనివారం ఆర్జీ-2 సేవా సమితి మహిళలు తరలివెళ్లారు. సేవా సమితి మహిళల హస్తకళతో రూపుదిద్దుకున్న పలు ఆకర్శణీయమైన బ్యాగులు, చీరలు, కాస్మోటిక్స్‌లను శనివారం సేవా సమితి కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేయగా వీటిని సేవా అధ్యక్షురాలు ఆశా సురేశ్‌ పరిశీలించి తయారీదారులను అభినందించారు. ఫిబ్రవరి-15 వరకు ఎగ్జిబిషన్‌లో సింగరేణిలోని అన్ని డివిజన్‌ల నుంచి మహిళలు విభిన్న వస్తువులను ప్రదర్శనకు తెస్తారని, వాటిని పరిశీలించి ఆర్జీ-2 సేవా మహిళలు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని ఆమె సూచించారు. పర్సనల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, జయశ్రీ, క్రాంతి, లక్ష్మి, సునీత, లత, కళావతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.