close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

విభిన్నం.. సింగరేణీయుల తీర్పు

యైటింక్లయిన్‌కాలనీ, న్యూస్‌టుడే: రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో యైటింక్లయిన్‌కాలనీ ఓటర్ల తీర్పు ఈసారి భిన్నంగా ఉంది. కాలనీలో 15, 16, 17, 18, 19 డివిజన్లు విస్తరించి ఉండగా, రెండు చోట్ల తెరాస, ఒక స్థానంలో భాజపా, మరో రెండు డివిజన్లలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు గెలిచారు. అయిదు డివిజన్లలో కలిపి మొత్తం 18,769 ఓటర్లుండగా, 10,443 ఓట్లు పోలయ్యాయి. 15వ డివిజన్‌ నుంచి తెరాస అభ్యర్థి బదావత్‌ శంకర్‌నాయక్‌ 756 ఓట్లు సాధించి విజయం సాధించగా భాజపా అభ్యర్థి రాజేష్‌నాయక్‌(476) ద్వితీయ, స్వతంత్ర అభ్యర్థి పాలిత్య రవినాయక్‌(455) తృతీయ స్థానంలో నిలిచారు. 16వ డివిజన్‌లో మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలవగా భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి 685 ఓట్లు సాధించి విజయం సాధించారు. ద్వితీయ స్థానంలో తెరాస అభ్యర్థి గౌస్‌పాషా(447), తృతీయ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి(207) నిలిచారు. 17వ డివిజన్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో తెరాస అభ్యర్థి సాగంటి శంకర్‌ 666 ఓట్లు సాధించి గెలుపొందారు. ద్వితీయ స్థానంలో మూకిరి రాజు(548), తృతీయ స్థానంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి పోలవేన రమేష్‌(524) నిలిచారు. 18 డివిజన్‌లో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిని బాదే అంజలిదేవి 760 ఓట్లు సాధించి గెలుపొందారు. ద్వితీయ స్థానంలో తెరాస అభ్యర్థిని కోండ్ర మాధవి(582), తృతీయ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని స్వప్న(528) నిలిచారు. 19వ డివిజన్‌లో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిని తాళ్ల అమృత 1326 ఓట్లు సాధించి గెలుపొందారు. ద్వితీయ స్థానంలో తెరాస అభ్యర్థిని కె.నాగమ్మ(624), తృతీయ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని స్వరూప(115) నిలిచారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.