close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

వైద్య సేవల పథకంలో సవరణ

విశ్రాంత ఉద్యోగులకు పరిహారం పెంపు
కొత్తగా సభ్యత్వానికి రూ.40 వేల రుసుం
న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణి విశ్రాంత కార్మికులకు అమలు చేస్తున్న వైద్య సేవల పథకంలో పలు మార్పులు చేశారు. పథకం కింద పరిహారం పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ పథకంలోనూ వెసులుబాటు కల్పించారు. గతంలో పూర్తి సర్వీసు, అనారోగ్య కారణాలతో అన్‌ఫిట్‌ అయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించగా తాజాగా వాలంటరీ పథకం ద్వారా ఉద్యోగ విరమణ పొందిన వారికి, 57 సంవత్సరాల దాటిన తర్వాత ఏదైనా కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు కూడా అర్హులుగా నిర్ణయించారు.

ఇకపై విశ్రాంత ఉద్యోగి మరణిస్తే అతడి భార్యకు వైద్య సేవల పథకం వర్తిస్తుంది. దివ్యాంగులు ఉంటే వారికి కూడా ఈ పథకంలో సభ్యులుగా ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం సవరించిన పథకానికి రూ.40 వేలు చెల్లించి సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పథకాన్ని రూ.5 లక్షల వరకు వైద్య సేవలకు పరిమితం చేయగా ప్రస్తుతం దాన్ని రూ.8 లక్షలకు పెంచారు. సభ్యుల్లో ఒకరు చనిపోయినా రెండో సభ్యుడు కూడా రూ.8 లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. దివ్యాంగులైన పిల్లలున్న వారు రూ.20 వేలు చెల్లిస్తే రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంటుంది. వీటితో పాటు గుండె, క్యాన్సర్‌, మూత్రపిండాలు, నరాల సంబంధిత వ్యాధులకు అపరిమితమైన ఖర్చుతో వైద్య సేవలు పొందే అవకాశం ఉంది.

సభ్యులెందరైనా రూ.40 వేలు
ఇదివరకే వైద్య సేవల పథకానికి పాత విధానం ప్రకారం తక్కువ డబ్బులు చెల్లించిన సభ్యులు మిగతా డబ్బులు చెల్లించి సవరించిన మేరకు పథకానికి అర్హత పొందాలని యాజమాన్యం ఓ ప్రకటనలో కోరింది. లేని పక్షంలో రూ.5 లక్షల వరకే వైద్య సేవల పథకం పొందే అవకాశం ఉంటుంది. గతంలో ఒకరు సభ్యులుగా ఉంటే వారికి మాత్రమే సగం డబ్బులు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఒకరున్నా, ఇద్దరున్నా మొత్తం రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. విశ్రాంత కార్మికులు సవరించిన వైద్య సేవల పథకం సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.