close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

అనభేరి కూడలి ఆధునికీకరణకు శ్రీకారం

మంత్రితో సీపీఐ నాయకుల చర్చలు సఫలం

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అనభేరి ప్రభాకర్‌ రావు ఐలాండ్‌ను కూల్చివేస్తున్నారనే వివాదం ఎట్టకేలకు శాంతియుతంగా ముగిసింది. శనివారం కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి గంగుల కమలాకర్‌తో సీపీఐ నాయకులు చర్చించారు. సీపీఐ నాయకుల వాదనలు విన్న మంత్రి నగరంలో కోర్టు చౌరస్తా, అంబేడ్కర్‌ ఐలాండ్‌, బస్టాండ్‌, కమాన్‌ చౌరస్తా ఆధునికీకరణ పనులను వివరించారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఐలాండ్‌ నవీకరణ పనులు నడుస్తున్నాయని, అనభేరి ప్రభాకర్‌రావు ఐలాండ్‌ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఎలాంటి ఆధునికీకరణ పనులు జరగలేదని బ్రహ్మోత్సవాల వేళ అనభేరి ఐలాండ్‌ చెత్తాచెదారం నిండిపోయిందని మంత్రి తెలిపారు. గతంలో ఆయన కుటుంబ సభ్యులతో దీనిపై చర్చించామన్నారు. బ్రహ్మోత్సవం వేళ పాత మట్టి తీసి కొత్తగా విగ్రహం చుట్టూ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు ఉద్దేశించారని తెలిపారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఐలాండ్‌ సుందరీకరణ పనులు చేపడతామని సీపీఐ నాయకులకు హామీనిచ్చారు. వెంటనే ఐలాండ్‌ అభివృద్ధి పనులకు మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పొనుగంటి కేదారి, సహయ కార్యదర్శి సృజన్‌కుమార్‌, మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, పైడిపల్లి రాజు, బోయిని అశోక్‌, సదాశివ, యుగేందర్‌, పంజాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.