close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ముస్తాబైన దుబ్బరాజన్న

నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు
19 నుంచి 23వరకు ఉత్సవాలు
సారంగాపూర్‌, న్యూస్‌టుడే

జిల్లాలో శైవక్షేత్రాలలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన సారంగాపూర్‌ మండలం పెంబట్ల, కోనాపూర్‌లోని దుబ్బరాజన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వయంభూగా వెలసిన దుబ్బరాజేశుడికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అత్యంత వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు జరగుతుండటంతో ఆయా జిల్లాల నుంచి దాదాపు 4లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఐదు రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు
దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 23వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 19న సాయంత్రం 6.05 గంటలకు స్వస్తిశ్రీ పుణ్యాహవచనం, అంకురార్పణ, 20న రాత్రి 8.21 గంటలకు స్వామివారి కల్యాణమహోత్సవం ఉంటుంది. 21న మహాశివరాత్రిజాగరణ, రాత్రి 12గంటలకు లింగోద్భవ కాలమున రుద్రాభిషేకం, నిశీపూజ, 22న పారణ, 23న ఉదయం 10.23 గంటలకు స్వామివారి రథోత్సవం(స్వామివారు రథంపై ఊరేగింపు) నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత వచ్చే మొదటి సోమవారం 24న ఏకాదశ రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా యంత్రాంగా దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షాలాధి మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల నుంచి ప్రతి 10నిమిషాలకో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కోసం మూడు షిప్టులలో 60 మది కార్మిక సిబ్బందిని నియమించారు. క్లోరినేషన్‌, తాగునీటి కోసం అన్నీ ఏర్పాట్లు చేయగా జాతర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్డీవో నరేందర్‌ ఆధ్వర్యంలో సారంగాపూర్‌, బీర్‌పూర్‌ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ గదిని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడే పర్యవేక్షించనున్నారు. గర్భగుడిలో అభిషేకాలు లేకుండా ప్రత్యేకంగా ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేశారు. స్థానిక భక్తులకు ఉదయం 3గంటల నుంచి 6గంటల వరకు గర్భగుడిలో అభిషేకాలకు అనుమతి ఇచ్చారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలు
కాంతారెడ్డి, ఆలయ ఈవో, దుబ్బరాజన్న
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేక క్యూలైన్లతోపాటు కోనేరు వద్ద ఎప్పటికప్పుడు నీటిని తోడేయడం, ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. స్వామివారి కల్యాణం, మహాశివరాత్రి జాగరణ, రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.