close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

చర్చ జరగాలి.. సమస్యలు తీరాలి

ప్రాధాన్య అంశాల ఊసెత్తాలి
అన్ని శాఖల భాగస్వామ్యం కనబడాలి
నేడు జిల్లాపరిషత్‌ సమావేశం
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా మరో సమావేశానికి జిల్లా పరిషత్‌ సిద్ధమైంది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్న సర్వసభ్య సమావేశంలో ఏమేరకు సమస్యలు ప్రస్తావనకు వస్తాయనే ఆశ అందరిలో మెదులుతోంది. కొత్తగా కొలువుదీరిన జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యే ఈ సమావేశం గత సమావేశాలకు భిన్నంగా జరగాలనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రధానంగా జిల్లాలోని పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాధన్యతాంశాలపై సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరముంది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ హాజరవుతుండటంతో ఆయా మండలాల్లోని కీలక సమస్యలకు కచ్చితమైన పరిష్కారం సమావేశంలో దొరికే అవకాశం ఉండనుంది. రైతులు సాగుసమరంలో ఎదుర్కొంటున్న ఇక్కట్లతోపాటు ఇటీవల ప్రమాదాలతో హడలెత్తిస్తున్న రహదారులు, వంతెనల తీరుపైనా పలువురు సభ్యులు పెదవి విప్పే అవకాశముంది. పల్లెలోని మౌలిక వసతులతోపాటు పాలనాపరంగా కనిపిస్తున్న లోటుపాట్లు, ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది పనితీరులపైనా చర్చ జరిగే వీలుంది.

సద్వినియోగ పర్చుకునేలా...
సమావేశంలో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చుకునేలా సభ్యులతోపాటు అధికారులు నేటి సమావేశాన్ని అనుకూలంగా మలచుకోవాల్సిన అవసరముంది. గత సమావేశంలో ప్రధానంగా ఆయా శాఖల అధికారుల గైర్హాజరీపై చర్చ జరిగింది. కచ్చితంగా ప్రతి ఒక్కశాఖకు చెందిన ఉన్నతాధికారి రావాలని, చాలా శాఖల నుంచి మొక్కుబడిగా కిందిస్థాయి సిబ్బంది హాజరవుతున్న తీరుని ఛైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు తప్పుబట్టారు. ఉదయం 10.30నిమిషాలకు ప్రారంభమయ్యే సమావేశంలో మధ్యాహ్నం వరకే ఒక స్థాయిలో చర్చ జరుగుతోంది. తరువాత మధ్యాహ్నం తరువాత సభ్యులతోపాటు అధికారుల సంఖ్య పలుచబడుతోంది. పైగా ఉదయం పూట మూడు నాలుగు శాఖలపైనే చర్చ జరగడంతో ఆయా శాఖల ప్రాధాన్యం నామమాత్రంగానే మారిపోతుంది. అందువల్ల సమయానుసారంగా..ప్రణాళికాయుతంగా సమావేశాన్ని నిర్వహించేలా నేడు చొరవ కనిపించాల్సిన అవసరముంది. ఉన్న సమయాన్ని సద్వినియోపర్చుకుంటే ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు పరిష్కారాలు దొరికే వీలుంటుంది. మరి నేటి జడ్పీ సమావేశం ఎలా జరుగనుందనేది కాసేపట్లో తెలిసిపోనుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.