close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరంలో 11 కేసులు

అత్యధికంగా నమోదు కావడం మొదటిసారి

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: నగరంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. మొదటిసారిగా శనివారం  అత్యధికంగా 11 నమోదయ్యాయి. వ్యాధి విజృంభించడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య బృందాలను పంపించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు శనివారం అందిన నివేదిక ప్రకారం పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గణేశ్‌నగర్‌లో ఇటీవల ఒక మహిళకు పాజిటివ్‌ నమోదు కాగా అదే కుటుంబానికి చెందిన తల్లికి, ఇద్దరు పిల్లలకు మొత్తం ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్ష్మీనగర్‌లో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి ఇక్కడ కూడా ఇద్దరికీ వ్యాధి సోకింది. శ్రీనగర్‌కాలనీ, కట్టరాంపూర్‌, శాంతినగర్‌, పద్మాశాలీ వీధి, హౌసింగ్‌బోర్డుకాలనీ ఒక్కొక్కరికి , సరస్వతీనగర్‌లో ఒక మహిళకు పాజిటివ్‌ రాగా వారికి చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇతర గ్రామాల్లో ఆరుగురికి
హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఒకరికి, జమ్మికుంట మండలం వావిలాలలో ఒక ఉద్యోగికి, చొప్పదండిలో ఒక వ్యక్తికి, అర్నకొండలో ఒక వ్యక్తికి, రామడుగు మండలం గుండిలో ఒకరికి, తిమ్మాపూర్‌ మండలంలోని బండ్లపల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. వీరందరి వివరాలు సేకరించి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించి తగిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు

కొనసాగుతున్న వైద్య పరీక్షలు
కరీంనగర్‌ జిల్లాలోని నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో 21 వైద్య బృందాలు, 1066గృహాలను సందర్శించి 4,075మందికి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. మానకొండూర్‌లో డాక్టర్‌ సంధ్యారాణి, హుజురాబాద్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె.వి.సుధాకర్‌రెడ్డి, కరీంనగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సుశ్రిత, రాజ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ యోగితా రాణా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేసినట్లు వివరించారు.

భయభ్రాంతులకు గురికావొద్దు : మంత్రి గంగుల
భగత్‌నగర్‌ : కరోనా పాజిటివ్‌ వచ్చిందని భయభ్రాంతులకు గురికావొద్దని   మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు.వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఇంటి నుంచి వెలుపలకు రాగానే విధిగా మాస్కు ధరించాలన్నారు. ఇటీవల నగర ప్రజాప్రతినిధి, కుటుంబ సభ్యులకు కరోనా సోకిందన్నారు. వారం రోజుల చికిత్సతో వ్యాధి నయంకావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారని తెలిపారు. ఇదే సమయంలో తానుసైతం ఐసోలేషన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.