close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

చిగురుమామిడి, న్యూస్‌టుడే: చిగురుమామిడి మండలం ఓగులాపూర్‌లో ఒకరికి కరోనా సోకడంతో ఆ గ్రామంతో పాటు ఇందుర్తిలోనూ శనివారం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ మేరకు సర్పంచులు శ్రీనివాస్‌, స్వరూప అధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానించారు.

పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని వినతి

కరీంనగర్‌ సంక్షేమ విభాగం : బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒకే ఉద్యోగి ఉపకారవేతనాలతో పాటు ఇతర పనులు చేస్తుండటంతో ఇబ్బందులున్నాయని పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని కోరుతూ శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి బీసీ సంక్షేమ శాఖ అధికారి మధుసూదన్‌కి వినతిపత్రం సమర్పించారు.

రెడ్డి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాధాకృష్ణారెడ్డి

తెలంగాణచౌక్‌ : రెడ్డి ఐకాస తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన ఉట్కూరి రాధాకృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు ఐకాస జాతీయ ప్రధానకార్యదర్శి నందికొండ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయనకు ఈ మేరకు నియామక పత్రం అందజేశారు. మార్చి, 2022 వరకు ఈ పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఎరడపల్లి(శంకరపట్నం) : మండలంలోని ఎరడపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై ఎస్సై రవి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రూ.15,730 నగదు స్వాధీనం చేసుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

తాడికల్‌(శంకరపట్నం), న్యూస్‌టుడే: మండలంలోని తాడికల్‌ గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కరుణాకర్‌ ద్విచక్ర వాహనంపై కిరాణ దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిపై కాలి నడకన వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి వాహనం అదుపు తప్పింది. రహదారిపై పడటంతో కరుణాకర్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.