close

ఆదివారం, ఆగస్టు 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్రో ధరల పెంపుపై ఆందోళనలు

తిమ్మాపూర్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కవ్వంపల్లి, నాయకులు

కార్పొరేషన్‌ : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నగరపాలక ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌కు విజ్ఞాపనపత్రం అందజేశారు. నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సమద్‌నవాబ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

రామడుగు : రామడుగులో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ వెన్న రాజమల్లయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. తహసీల్దార్‌ కోమల్‌రెడ్డికి వినతిపత్రాన్నిచ్చారు. ఒంటెల రత్నాకర్‌, నాగి శేఖర్‌, జవ్వాజి హరీష్‌, పాల్గొన్నారు.

గంగాధర : గంగాధరలో టీపీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మనోహర్‌, నాయకులు పాల్గొన్నారు.

మానకొండూర్‌ : పెట్రోల్‌ ధరల పెంపుపై మానకొండూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు తహసీల్దార్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. మాజీ సర్పంచి నందగిరి రవీంద్రాచారి, ఉప సర్పంచి తాళ్లపెల్లి సంపత్‌ పాల్గొన్నారు.

తిమ్మాపూర్‌ : కాంగ్రెస్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని శనివారం అందజేశారు. నాయకులు బండారి రమేష్‌, గోపు మల్లారెడ్డి, ఎస్‌ఎల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.


జమ్మికుంటలో మినీ ట్రాలీని తాడుతో లాగుతున్న కాంగ్రెస్‌ నాయకులు

బొమ్మకల్‌(కరీంనగర్‌ గ్రామీణం): కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తోట కిరణ్‌ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జువ్వాడి మారుతీరావు, ఎం.సాయిల్‌, అంజయ్య, పాల్గొన్నారు.

కొత్తపల్లి : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూడాలని తెపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులతో కలిసి శనివారం కొత్తపల్లి మండల తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేసి రాష్ట్రపతికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు బోనాల మురళీమనోహర్‌, నాయకులు రాచకొండ ప్రభాకర్‌, పొన్నం సత్యనారాయణ, బొమ్మ ఈశ్వర్‌గౌడ్‌, మడుపు మోహన్‌, శ్రావణ్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

● కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కొత్తపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు శనివారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు చర్ల పద్మ, 6వ వార్డు కౌన్సిలర్‌ గున్నాల విజయ, పట్టణ అధ్యక్షుడు గున్నాల రమేష్‌ పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ పట్టణం : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ, మండలశాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయ డీఏవో రమేశ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నేరెళ్ల మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

వీణవంక : వీణవంక మండల కాంగ్రెస్‌ నాయకులు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కృష్ణచైతన్యకు వినతిపత్రం అందజేశారు. నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, వీణవంక సర్పంచి నీల కుమార్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

చిగురుమామిడి : చిగురుమామిడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ బాధ్యుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి అధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

జమ్మికుంట, న్యూస్‌టుడే: జమ్మికుంటలో కాంగ్రెస్‌ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పోల్నేని సత్యనారాయణరావు ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఆర్వోబీ వంతెన రహదారి నుంచి గాంధీచౌక్‌ కూడలి వరకు మినీ ట్రాలీని తాళ్లతో లాగారు. పార్టీ నాయకులు సాయిని రవి, ఎగ్గని శ్రీనివాస్‌, గాజుల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందకుంట : ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ సురేఖకు వినతిపత్రం అందజేశారు. దరుగుల రాకేశ్‌, గూడేపు సారంగపాణి, కసుబోజుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సైదాపూర్‌, న్యూస్‌టుడే: పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు రావీందర్‌రావు, నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సైదాపూర్‌ తహసీల్దార్‌ సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు కిష్టయ్య, సంతోశ్‌, రాజ్‌కుమార్‌, రాహూల్‌, సందీప్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.