close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పారిశుద్ధ్యంపై శ్రద్ధ ఏది?

నీటి వనరుల్లో కలుస్తున్న మురుగు

పట్టణంలో పందుల సంచారంతో తప్పని ఇక్కట్లు

వేములవాడ, న్యూస్‌టుడే

గుడిచెరువులో కలుస్తున్న మురుగు

ప్రసిద్ధ పుణ్యక్షేత్ర పట్టణంగా పేరుగాంచిన వేములవాడ పట్టణంలో పారిశుద్ధ్యం అదుపులో లేకుండా పోతుంది. అసలే కరోనా వైరస్‌తో ఆందోళన చెందుతున్న స్థానికులకు అపరిశుభ్ర వాతావరణం, పందుల సంచారంతో భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా హడావుడి చేసిన అధికారులు తరవాత విస్మరించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అసలే వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన మున్సిపల్‌ యంత్రాంగం పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదన్న విమర్శలున్నాయి.

పట్టణంలోని పలు వార్డుల్లో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పందుల సంచారం పెరిగిపోయింది. వార్డుల్లో పోగవుతున్న మురుగు గుడిచెరువు, మూలవాగులోకి మళ్లించడంతో పరిసరాల్లో దుర్వాసన వస్తుంది. భగవంతరావునగర్‌ వీఐపీ రోడ్డులో పదుల సంఖ్యలో పందులు సంచరిస్తున్నాయి. బురదలో పొర్లుతూ జనావాసాల్లో తిరగడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంజూరైన రూ.2.13 కోట్లతో పట్టణంలో రెండుసార్లు రూ.29 లక్షలు వెచ్చించి పారిశుద్ధ్య పనులు చేపట్టినా పరిస్థితి మారలేదు. గుడిచెరువులో మురుగు కలవకుండా మళ్లించేందుకు రూ.2 కోట్లతో చేపట్టిన మేజర్‌ డ్రైనేజ్‌ పనులకు ఏడాది క్రితం భూమిపూజ చేశారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో మురుగంతా చెరువులోనే కలుస్తుంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీటితో సమస్యగా మారింది. కొత్తగా ఏర్పడుతున్న పలు కాలనీల్లో మురుగు కాల్వలు, సీసీరోడ్లు లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో పారిశుద్ధ్య సమస్యపై ఇప్పటికైనా అధికార యంతాంగ్రం తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


పట్టణంలో పందుల సంచారం

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి - ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌

వేములవాడ పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాం. మురుగును మళ్లించేందుకు ప్రత్యేక అంచనాలు రూపొందిస్తున్నాం. మురుగు శుద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించార. పట్టణంలో పందులు ఏరివేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. పందుల పెంపకందార్లతో రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేశాం. పలుమార్లు నోటీసులు ఇచ్చాం.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.