close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్తగా 89 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలోనే కరీంనగర్‌ 4వ స్థానం

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లాలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన బులెటిన్‌లో రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లా పాజిటివ్‌ కేసుల్లో నాలుగో స్థానంలో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 298 నమోదు కాగా, వరంగల్‌ అర్బన్‌లో 144, రంగారెడ్డి 124, కరీంనగర్‌లో 89 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తగ్గడం లేదు. దాదాపు 90 మంది జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాల్లో చికిత్స పొందుతుండగా అత్యధికులు హోంఐసోలేషన్‌లో ఉంటున్నారు. గురువారం ప్రకటించిన పాజిటివ్‌ కేసులు 89 కలుపుకొని ఆ సంఖ్య 3,608కి చేరుకుంది. పట్టణాలు, నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న చట్ట సభల్లోని ప్రతినిధులతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి కరోనా వెంటాడుతోంది. మొత్తం మీద కరోనా తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నగర, పురపాలికలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

హుజూరాబాద్‌లో 20 మందికి కరోనా

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. గురువారం హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో 102 మంది ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోగా 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్థానిక గాంధీనగర్‌లో ఒకరికి, వివేకానందనగర్‌లో నలుగురికి, ప్రతాపవాడలో ఒకరికి, రజకవాడలో ఇద్దరికి, రాజీవ్‌నగర్‌లో ఒకరికి, ఎస్‌డబ్ల్యు కాలనీలో మరోకరికి, శివాజీనగర్‌లో ఒకరికి, వరంగల్‌రోడ్‌లో ఇంకోకరితో పాటు హుజూరాబాద్‌లోనే మరోకరికి పాజిటివ్‌గా తేలింది. అలాగే ఇప్పల నర్సింగాపూర్‌లో ముగ్గురికి, తుమ్మనపల్లిలో ఒకరికి, పెద్దపాపయ్యపల్లిలో ఇద్దరికి, రంగాపూర్‌లో మరోకరికి పాజిటివ్‌ వచ్చింది. మొత్తంగా గత నెల రోజుల నుంచి కరోనా వైరస్‌ హుజూరాబాద్‌ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక్కడి ఆస్పత్రిలో ఇప్పటివరకు 3,455 మందికి యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా 588 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్య బృందాలు గురువారం హుజూరాబాద్‌ మండలం చెల్పూరు పీహెచ్‌సీ పరిధిలోని 13 గ్రామాల్లో 374 గృహాలను సందర్శించి 1,296 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇల్లందకుంటలో ఆరుగురికి కరోనా

ఇల్లందకుంట, న్యూస్‌టుడే: ఇల్లందకుంట మండలంలో గురువారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 20మందికి గురువారం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష నిర్వహించామని వైద్యవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.