close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పార్టీ క్రమశిక్షణతోనే కోఆప్షన్‌ పదవులు ఏకగ్రీవం

ప్రజలు ఆశించినట్లుగానే నగరాభివృద్ధి

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : తెరాస పార్టీలో క్రమశిక్షణతోనే కరీంనగర్‌ నగరపాలక సంస్థలోని అయిదు కోఆప్షన్‌ పదవులు ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కోఆప్షన్‌ ఎన్నికల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించినట్లు చెప్పారు. పార్టీ సూచించిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిదుగురిని ఎన్నుకున్నామన్నారు. తెరాస పాలకవర్గ సభ్యులు నలుగురు అభ్యర్థులకు, మిత్రపక్షమైన అభ్యర్థికి మద్దతు పలికినట్లు చెప్పారు. అధిష్ఠానం మాటకు కట్టుబడి సభ్యులను ఎంపిక జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో పార్టీ కమిట్‌మెంట్‌తో ముందుకు సాగితేనే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తెరాసకు మద్దతు ఉండి గెలిపించారని, ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. పార్టీ, ప్రభుత్వం తరఫున ప్రజలకు మచ్చ లేని పాలన అందిస్తామని, నగరవాసులు కోరుకునే విధంగా నగరాన్ని మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

కలెక్టరేట్‌లోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కలెక్టరేట్‌ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి శశాంక ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేస్తారని తెలిపారు. ఏటా నిర్వహిస్తున్నట్లు వేడుకలను పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కాకుండా.. కొవిడ్‌-19 నిబంధనల మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.