close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యానం.. ఆహ్లాదం

ప్రజలకు అందుబాటులో ఎనిమిది

ఆధునికీకరణ పనులపై ప్రతిపాదనలు

న్యూస్‌టుడే-కార్పొరేషన్‌

న్యూశ్రీనగర్‌కాలనీ పార్కులో నిలిచిన అభివృద్ధి పనులు

నగరపాలిక పరిధిలోని ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తుండటంతో ఆయా ప్రాంతాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. గతంలో నిధులు లేక ఆ స్థలాలు నిరూపయోగంగా మారగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.

రీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పార్కు స్థలాలను ఉపయోగంలోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కొన్ని పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. నగర పరిధిలోని 60డివిజన్లలో సుమారు 45 ఖాళీస్థలాలు ఉన్నాయి. వీటిని లేఅవుట్ల కింద వదిలేసిన స్థలాలే అధికంగా ఉన్నాయి. పలు డివిజన్‌లలో ఇప్పటికే పార్కులు ఉండగా వాటిని కూడా ఆధునికీకరణ చేశారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు పార్కుల్లో సౌకర్యాలు కల్పించేందుకు రూ.వంద కోట్ల నిధులతో పాటు అమృత్‌ పథకంలోని రూ.8.35కోట్లు కేటాయించగా అందులో రూ.2.50కోట్లతో పనులు పూర్తయ్యాయి.

ఎనిమిది ప్రాంతాల్లో ఆహ్లాదం

నగరంలోని పలు డివిజన్లలో ఆహ్లాదకర వాతావరణం కోసం, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఎనిమిది ప్రాంతాల్లో ఉన్న పార్కులు ఉపయోగంలో ఉన్నాయి. వీటిలో జడ్పీ క్వార్టర్స్‌, మిషన్‌ భగీరథ పార్కు, వావిలాలపల్లి, రాజీవ్‌పార్కు, జ్యోతినగర్‌-1, శాంతినగర్‌, శివనగర్‌ పార్కు, ఏవోఎస్‌ కాలనీలో ఉన్న పార్కులు తీర్చిదిద్దారు.

పలు చోట్ల అసంపూర్తిగా పార్కులు

కొవిడ్‌ కారణంగా నిలిచి పోయిన పనుల్లో పురోగతి కన్పించడం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పనులు పలు దశల్లో ఆగిపోయాయి. జ్యోతినగర్‌-2 పార్కులో 45శాతం పనులు, న్యూశ్రీనగర్‌కాలనీలో 10శాతం, బ్యాంకుకాలనీలో 10శాతం, హౌసింగ్‌బోర్డుకాలనీలో 25శాతం, అలకాపురి కాలనీలో 10శాతం, బుట్టిరాజరాంకాలనీలో పార్కు-1, పార్కు-2 50శాతం చొప్పున, అలకాపురిలో 60శాతం మేరనే పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతవాసులకు ఆర్యోగవంతమైన వాతావరణం ఉట్టి పడనుంది.

రూ.2.15కోట్లతో ప్రతిపాదనలు

అసంపూర్తిగా ఉన్న పార్కులతో పాటు కొత్త ప్రతిపాదనల పనులు కూడా వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. నిధుల కేటాయింపు ఉండటంతో మరో ఏడు పార్కులు అభివృద్ధి చేసేందుకు రూ.2.15కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ పనులు కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 6, 7డివిజన్‌లలోని హౌసింగ్‌బోర్డుకాలనీ రూ.50.90లక్షలు, తమిల్‌కాలనీ వినాయక టెంపుల్‌ వైపు రూ.26లక్షలు, అలకాపురిలో రూ.20లక్షలు, 10వ డివిజన్‌ కట్టరాంపూర్‌లో రూ.25.50లక్షలు, 15వ డివిజన్‌లోని పార్కు కోసం రూ.34లక్షలు, పద్మానగర్‌లో రూ.59లక్షలు కేటాయించారు. అయితే వీటికి సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తే ఆయా ప్రాంతవాసులకు ఆహ్లాదం అందనుంది.

నగర జనాభా : 3.5లక్షలు

డివిజన్లు : 60

నిధులు : రూ.5.85కోట్లు

ఖాళీ స్థలాలు : 45

పార్కులు : 08

నిర్మాణ దశలో : 08

ప్రతిపాదిత పనులు : 07

దసరా కల్లా వినియోగంలోకి పార్కులు - వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌ నగరపాలిక

తుది దశలో ఉన్న పార్కులను దసరా కల్లా పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతోంది. అసంపూర్తి పనులు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చాం. స్మార్ట్‌సిటీలో ఒక పార్కు వినియోగంలోకి వస్తుంది. కౌన్సిల్‌ అనుమతితో కొత్తగా మరికొన్ని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.