close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

సత్తుపల్లిలో సినీనటుడు రఘుబాబు సందడి

రఘుబాబు దంపతులను సన్మానిస్తున్న నిర్వాహకులు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటుడు, గిరిబాబు తనయుడు యర్రా రఘుబాబు సత్తుపల్లిలో ఆదివారం సందడి చేశారు. స్థానిక లక్ష్మీప్రసన్న కల్యాణ మండపంలో జరిగిన యర్రా వారి షష్ఠి (6వ) ఆత్మీయ కలయికకు ఆయన తన సతీమణితో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా యర్రా వారి ఆత్మీయ కలయిక వేడుకను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం పలువురిని సన్మానించారు. రఘుబాబు, గీతా దంపతులను శాలువా, పుష్పగుచ్ఛాలతో యర్రా కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ కలయికకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి యర్రా కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.