close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

పీఠమెక్కిన పుర పాలకులు

అయిదు మున్సిపాలిటీల్లో కొలువుదీరిన పాలకవర్గాలు

ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్ల ఎన్నిక ఏకగ్రీవం

ఈనాడు, ఖమ్మం

కొత్తగూడెంలో ఛైర్‌పర్సన్‌ ఎంపిక అనంతరం అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే వనమా. చిత్రంలో సీతాలక్ష్మి తదితరులు

కొత్తగూడెం కాపు సీతాలక్ష్మి వొేల్పుల దామోదర్‌

వెంకటేశ్వర్లు

లత

మధిర

వైరా

ఇల్లెందు

సత్తుపల్లి

కొత్తగూడెం

జైపాల్‌

సీతాలక్ష్మి

మహేశ్‌

పూర్వ ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎన్నికలు జరిగిన అయిదు పురపాలకాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ఆశలు, ఆకాంక్షలు.. అసంతృప్తులు, బుజ్జగింపుల పర్వం మధ్య ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ ఎంపికను అధికార పార్టీ విజయవంతంగానే పూర్తి చేసింది. అయితే ఎంపికల వెనుకు ఆరోపణలు కూడా వినిపించడం గమనార్హం. కొత్తగూడెంలో తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ పులి గీత సమావేశ మందిరంలో ముభావంగా ఉన్నారు. పీఠం ఆశించిన కౌన్సిలర్‌ కాసుల ఉమారాణి కుమారుడు సాయిచరణ్‌ భద్రాచలం-ఖమ్మం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సత్తుపల్లి పీఠం ఆశించిన తాజా మాజీ వైస్‌ ఛైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు ఛైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉండటం గమనార్హం.

ఖమ్మం జిల్లా మధిర, వైరా, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు పురపాలక సంఘాల పరిధిలో సోమవారం నూతన పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వహించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్‌.వి.కర్ణన్‌, రజత్‌కుమార్‌ శైనీ పర్యవేక్షణలో పాలకవర్గాలు కొలువుదీరాయి. మధిర, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో మహిళలు, మిగతా మూడు చోట్ల పురుషులు పీఠాన్ని అధిరోహించారు. నిర్దేశిత సమయం 11 గంటలకు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఛైర్మన్‌, ఆ తర్వాత వైస్‌ఛైర్మన్‌ ఎన్నికకు తెరతీశారు. ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ స్థానాలకు మెజారిటీ స్థానాలు గెలుచుకున్న తెరాస తమ పార్టీ తరుపున పేరును ప్రతిపాదించింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎక్కడ కూడా ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ పీఠాలకు నామినేషన్‌ వేయలేదు. దీంతో ఒకే ఒక నామినేషన్‌ తెరాస నుంచి రావడంతో అధికారులు ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ల పేర్లు ప్రకటించారు. అనంతరం వైస్‌ఛైర్మన్లకు అదే మాదిరి ఒకే ఒక నామపత్రం దాఖలు కావడంతో అన్ని చోట్ల పదవులు ఏకగ్రీవంగా దక్కించుకున్నట్లైంది.

కొందరు మౌనం.. మరికొందరు ముభావం

పురపాలక సంఘాల ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్ల పేర్లు ప్రకటించకముందు నుంచే తెరాసలో పదవుల్ని ఆశించినవారు అసంతృప్తికి గురయ్యారు. సత్తుపల్లి మినహా మిగతా వారిని శిబిరాల నుంచి నేరుగా పురపాలక సంఘాల కార్యాలయాలకు తరలించారు. శిబిరం నుంచి బయలుదేరే ముందే ఎవరికి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఇస్తున్న విషయం ఎమ్మెల్యేలు, వారి సహచరులు కౌన్సిలర్లకు చెప్పారు. ఫలితంగా పీఠం ఆశించిన వారు ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు. ముభావంగా గడిపారు.

● శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు వాహనంలో కొత్తగూడెం పురపాలక కార్యాలయం సమీపం వరకు తీసుకురావడం, వెంటనే గేట్లు వేసేలా చర్యలు తీసుకోవడం గమనార్హం. కొత్తగూడెం ఛైర్‌పర్సన్‌ స్థానానికి తెరాస నుంచి ఒకటే నామినేషన్‌ రావడంతో ఏకగ్రీవం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా చప్పట్లు కొట్టకపోవడం గమనించాల్సిన అంశం. ఇదిలా ఉంటే తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ పులి గీత సమావేశం మందిరంలో చివరి వరుసలో కూర్చున్నారు. ఛైర్‌పర్సన్‌ ఏకగ్రీవం తర్వాత ఆమె ఒక్కరే ముభావంగా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మరో కౌన్సిలర్‌ కాసుల ఉమారాణి కుమారుడు సాయిచరణ్‌ పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవి తన తల్లికి కాకుండా మరొకరికి ఇస్తున్నారని తెలుసుకొని భద్రాచలం-ఖమ్మం రహదారిపై బైఠాయించారు. లారీ వస్తుంటే.. అడ్డంగా పడుకున్నారు. పోలీసులు అతన్ని పక్కకు తప్పించారు. మరికొందరు కౌన్సిలర్లు కూడా తమకు పీఠం దక్కలేదన్న అసంతృప్తితో రగలిపోతున్నారు. నివురుగప్పిన నిప్పులా తెరాస కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి.

● ఇల్లెందు పురపాలకంలో సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ మడత రమ హాజరుకాలేదు. తాజాగా రమను ఆమె భర్త వెంకటగౌడ్‌ తదితరులను తెరాస సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ ప్రమాణ స్వీకారానికి రాలేదు. మధిర, వైరాలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగగా.. సత్తుపల్లిలో బుజ్జగింపులు పని చేయలేదు. మార్కెట్‌ కమిటీ, ఆత్మ కమిటీ బూచిగా చూపించినా అలకలు ఆగలేదు. పీఠం ఆశిస్తున్న వారితో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. రెండు సామాజిక వర్గాల వారీతో సమీక్షలు చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారానికి తెరాస కౌన్సిలర్లు వెళ్లారు. ఇదే సందర్భంగా సత్తుపల్లి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా కొత్తూరు ఉమామహేశ్వరరావు పేరును ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సత్తుపల్లి ఛైర్మన్‌ ఎన్నిక సమయంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు సమావేశానికి రాలేదు. ఈ విషయం సత్తుపల్లిలో ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా మారింది.

కాకతాళీయమే(నా)?

తాజా మాజీ ఛైర్‌పర్సన్లు ఇరువురు వి‘చిత్ర’ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. అయిదేళ్లపాటు ఛైర్‌పర్సన్‌గా వెలుగొందిన వారు ఇపుడు కౌన్సిలర్లుగా ఉండాల్సి రావడం గమనార్హం. తాజా ఎన్నికల్లో గెలుస్తారో? లేదో? అన్న మీమాంస నుంచి బయట పడినప్పటికీ పీఠం దరిచేరలేకపోయారు. మధిర తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ మొండితోక నాగరాణి, కొత్తగూడెంలో తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ పులి గీత పరిస్థితి ఇదే. ఇల్లెందులో మడత రమ తెరాస రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సోమవారం నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. సత్తుపల్లిలో తాజా మాజీ వైస్‌ఛైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు గత సెషన్‌లో ఉన్న పదవి కూడా ఇపుడు లేదు. ఛైర్మన్‌ పీఠం ఆశించినా దక్కలేదు. ఇపుడు ఆయన కౌన్సిలర్‌గానే మిగలాల్సి రావడం విశేషం.

ఛైర్మన్‌/ఛైర్‌పర్సన్‌ వైస్‌ ఛైర్మన్లు

వైరా సూతకాని జైపాల్‌ ముళ్లపాటి సీతారాములు

మధిర మొండితోక లత ఎరమల విద్యాలత

సత్తుపల్లి కూసంపూడి మహేశ్‌

తోట సుజలరాణి

ఇల్లెందు డి.వెంకటేశ్వర్లు జానీ పాషా

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.