close

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

ప్రధానాంశాలు

రహదారి భద్రత కాదు.. జీవిత భద్రత కావాలి: సీపీ

రహదారి భద్రత ప్రచార గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, డీటీవో కృష్ణారెడ్డి

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: రహదారి భద్రత అనేది ఓ వ్యక్తికి సంబంధించినది కాదని.. ఓ కుటుంబానికి సంబంధించిందని, తద్వారా జీవితాలకు భద్రత లభిస్తుందని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 31వ రహదారి భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రహదారి భద్రత గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. సీపీ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 280మంది మృత్యువాత పడ్డారని, వాటిలో 88మంది శిరస్త్రాణం లేకపోవడం వల్లనే తలకు గాయాలై మరణించారని పేర్కొన్నారు. 2020 సంవత్సరాన్ని పోలీస్‌శాఖ రహదారి భద్రత, మహిళా రక్షణ సంవత్సరంగా ప్రకటించిందన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు అన్ని శాఖలతో కలిసి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని మానుకోవాలన్నారు. ప్రతి పోలీస్‌ వాహనంలో ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా రవాణాధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రమాదరహిత జిల్లాగా ఖమ్మంను చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆటోలపై రహదారిభద్రత వారోత్సవాల ప్రచార పత్రాల స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, ఎంవీఐ శంకర్‌నాయక్‌, ఏఎంవీఐలు కిషోర్‌బాబు, మనోహర్‌, మసూద్‌అలీ పాల్గొన్నారు. దీనికి ముందు నంద్యాల నాగేశ్వరరావు బృందం రోడ్డు భద్రతపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.