close

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

ప్రధానాంశాలు

‘పల్లె ప్రగతి’పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్‌ శైనీ

సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక అధికారులు

మాట్లాడుతున్న కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ, చిత్రంలో జేసీ

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పంచాయతీలు మినహా దాదాపు అన్నింటికీ ట్రాక్టర్లు, హైడ్రాలిక్‌ ఆటో రిక్షాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొదటి విడత ‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ జనాభా, నిధుల ప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేయాలని ఆదేశించినా కొన్నిచోట్ల ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వాహనాలను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో కూడా అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో మరో 10 గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమై నిధులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ శైనీ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేయనున్నాయని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్ల పంపిణీ, నర్సరీల్లో మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణాలపై రానున్న 15 రోజుల్లో మరింత శ్రద్ధ తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీఆర్వో లక్ష్మణ స్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.