close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

బాలల రక్షణకు... పోక్సో ఈబాక్స్‌

అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం

న్యూస్‌టుడే - అశ్వారావుపేట గ్రామీణం

రోజూ ఎక్కడో చోట బాలికలు, యువతులపై దాడులు, అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆకతాయిల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. బాలల రక్షణకు జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా నేరుగా అంతర్జాలంలోనే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటే అఘాయిత్యాల నుంచి తమను తాము రక్షించుకోవడంతోపాటు... ఆకతాయిలనూ కటకటాల పాలు చేయవచ్చు.

అందుబాటులో రక్షణ యాప్‌

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో అంతర్జాల సౌకర్యం కలిగిన స్మార్ట్‌ ఫోన్లున్నాయి. ఇదే చరవాణి ఆధారంగా బాలికలు, యువతులు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రత్యేక యాప్‌లు రూపొందించారు. ఆకతాయిల, మృగాళ్ల తీరుతో కొందరు ఎవరితోనూ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉంటున్నాయి. అలాంటివి చోటు చేసుకోకుండా బాల, బాలికలకు రక్షణ కల్పించడానికి (www.ncpcr.gov.in) అనే వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు (pocso e-box) యాప్‌ను

రూపొందించారు. ఈ యాప్‌ను చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకుని బాలబాలికలు తమపై జరిగే దాడులపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వొచ్ఛు

అంతర్జాలంలోనే ఫిర్యాదుల నమోదు, చర్యలు

జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ-బాక్స్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత ప్రాంత అధికారులకు పది నిమిషాల్లోనే తెలియజేస్తూ వారిని

అప్రమత్తం చేస్తుంది. ఫిర్యాదుదారులు ఈ-బాక్స్‌ సంబంధించిన ముఖపుస్తకం, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, మెయిల్‌ల ద్వారా తమ పేర్లు బయటకు రాకుండా ఉండేలానూ ఫిర్యాదులు చేయవచ్ఛు అఘాయిత్యాలకు, అరాచకాలకు, ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే వారి వివరాలు, ప్రదేశాలను తెలియజేస్తూ పోస్ట్‌ చేసిన వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

- అబ్బయ్య, సీఐ, అశ్వారావుపేట

నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, యువతులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. వీటి బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించింది. బాలికలు, యువతులు తమ చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించుకుంటే ఆకతాయిలకు అడ్డుకట్ట వేయొచ్చు.

యాప్‌లోని అంశాలు

పీవోసీఎస్‌వో (పోక్సో ఈ-బాక్స్‌) అనే యాప్‌ను చరవాణిలోని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

చరవాణిలో వెబ్‌సైట్‌ తెరవగానే ఎడమ వైపు ఫిర్యాదుల నమోదు అనే చిహ్నం కనిపిస్తుంది. ఇందులో మొదట ఈమెయిల్‌, చరవాణి సంఖ్యతో ఐడీ నమోదు చేసుకోవాలి.

ఫిర్యాదు దారులపై దాడులు చేసిన వ్యక్తుల చిత్రాలు, సంబంధిత వివరాలను నమోదు చేయాలి.

వేధిస్తున్న వ్యక్తికి సంబంధించిన చిత్రాలు బాధితురాలు తీసి యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో అప్రూల్‌ చేయగానే ఆ సమాచారం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ బోర్డుకు చేరుతుంది. వెంటనే పర్యవేక్షకులు సమీపంలోని ఐడీసీడీఎస్‌ కార్యాలయానికి సమాచారం చేరవేస్తారు. ఐడీసీడీఎస్‌ అధికారులు పోలీసులకు సమాచారం తెలియజేస్తారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆకతాయిలపై చర్యలు తీసుకుంటారు.

నేరం - శిక్ష

జాతీయ బాలల హక్కుల చట్టం ప్రకారం బాలికలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటుంది. బాలల హక్కుల యాక్ట్‌ 1974, రూల్స్‌ 1976 ఆర్టికల్‌ 15, 16, 21, 24 ప్రకారం ఈ కింద విధంగా శిక్షలు అమలు చేస్తారు.

ఈ మొత్తం ప్రక్రియను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం పర్యవేక్షిస్తుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.