close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

పల్లె సమస్యలకు ప్రగతి పరిష్కారాలు

ఈనాడు, ఖమ్మం: పల్లెప్రగతితో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిబాటలో సాగుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరింత పురోగతి సాధించనున్నాయి. డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కలిపి రూ.561 కోట్ల నిధులు వారం రోజుల్లో మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి నిత్యం శ్రద్ధ వహిస్తే మరిన్ని  సత్ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో పనులు పూర్తి కావాలంటే నిధులు అవసరం. ఆ దిశగా తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటన ఆశలు చిగురింపజేస్తున్నాయి. డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.61 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.500 కోట్లు వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఈ నిధులలో కొంత భాగంగా ఉభయ జిల్లాలకు కేటాయించే అవకాశాలున్నాయి. ఇప్పటికే డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలకు సంబంధించిన స్థలాలను గుర్తించారు. పలు చోట్ల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చాలాచోట్ల నిధులలేమితో పనులు ముందుకు సాగడం లేదు. మరికొన్ని చోట్ల స్థలాలను గుర్తించాల్సి ఉంది.

సీసీ రోడ్ల నిర్మాణం..

గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడంలో సీసీ రోడ్లదే ప్రత్యేకత. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మంజూరైన 2,623 పనుల్లో 151 పనులు పురోగతిలో ఉండగా.. 119 మొదలు కావాల్సి ఉంది. మిగతా పనులు పూర్తి చేసుకున్నాయి. తాజాగా నిధులు రానుండటంతో కావాల్సిన పనులకు మోక్షం లభించనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మంజూరైన సీసీ రోడ్లకు కూడా నిధులు మంజూరు కావడంతో పనులు వేగమందుకోనున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.