close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖమ్మం కబుర్లు


గాంధీపార్కులో మొక్కలను పరిశీలిస్తున్న మేయర్‌ పాపాలాల్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మేయర్‌ డాక్టర్‌ గుగులోత్‌ పాపాలాల్‌ శనివారం పర్యటించారు. 13వ డివిజన్‌ గుదిమళ్లను సందర్శించిన మేయర్‌ రూ.10లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం గాంధీపార్కులో ఉన్న నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.

* నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కమిషనర్‌ అనురాగ్‌జయంతి శనివారం పరిశీలించారు. గట్టయ్యసెంటర్‌లో నిర్మిస్తున్న నూతన నగరపాలక సంస్థ భవనాన్ని మిషన్‌భగీరథ పనులను, దానవాయిగూడెం వాకింగ్‌ ట్రాక్‌, హరితహారం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

* 14వ డివిజన్‌లో సామాజిక భవన ఆధునికీకరణకు సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ భూమి పూజ నిర్వహించారు.

* 7వ డివిజన్‌ పుట్టకోటలో నూతనంగా ఏర్పాటుచేసిన మంచినీటి మోటార్‌ను స్థానిక కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు ప్రారంభించారు.

* రుణాల కోసం వీధి వ్యాపారులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు నగరపాలకంలో 18 కేంద్రాలను శనివారం ప్రారంభించినట్లు మెప్మా డీఎంసీ సుజాత తెలిపారు.

* బుర్హాన్‌పురం కూరగాయల మార్కెట్‌లో పేరుకుపోయిన కూరగాయల వ్యర్థాలను తొలగించాలని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు. స్పందించిన సిబ్బంది శనివారం తొలగించారు.

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సత్వరమే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంట్‌ స్థాయి అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: పొలం కంచె రాళ్లు విరగ్గొట్టిన వివాదంతో వి.వెంకటాయపాలెంలో మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్‌లో శనివారం నలుగురిపై కేసు నమోదు అయ్యింది.

* హరితహారంలో ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించేలా కృషి చేయాలని అదనపు కలెక్టరు స్నేహలత అన్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, చింతగుర్తి గ్రామాల్లో సహాయ కలెక్టరు ఆదర్శ్‌ సురభితో కలిసి శనివారం పర్యటించారు.

* అర్హులందరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తామని రఘునాథపాలెం తహసీల్దారు నరసింహారావు అన్నారు. చింతగుర్తి లో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల అర్హుల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. 20 ఇళ్లకు 93 మంది దరఖాస్తు చేయగా తహసీల్దారు నరసింహారావు విచారణ జరిపి 25 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. సర్పంచి రామారావు పాల్గొన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: నగరంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలకు చెందిన భూములను కాపాడాలని శనివారం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌కు పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అర్బన్‌ పార్కు నిర్మాణయోచన విరమించుకోవాలని, కళాశాల స్థలానికి రక్షణ కల్పించాలని కోరుతూ భాజపా నాయకుడు గెంట్యాల విద్యాసాగర్‌ శనివారం కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌కు వినతి పత్రం అందించారు.

అజరామరుడు దొడ్డి కొమరయ్య

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అజరామరుడని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ పేర్కొన్నారు. ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో కొమరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, కార్యవర్గ సభ్యులు ఎస్‌కె.జానిమియా, తాటి వెంకటేశ్వరరావు,కొండపర్తి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.


కొమరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు


పాలేరు సమాచారం


నేలకొండపల్లి తహసీీల్దార్‌ వీరభద్రంకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

నేలకొండపల్లి(ముదిగొండ), న్యూస్‌టుడే: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో శ్రేణులు నిరసన చేపట్టారు. నేలకొండపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచి రాయపూడి నవీన్‌, ఎంపీటీసీ బొందయ్య, వాసవీ, వెంకన్న, సత్యనారాయణ, నాగరాజు, హనుమంతరావు పాల్గొన్నారు.

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: పెట్రో ధరలు తగ్గించాలని తహసీల్దారు శ్రీనివాసరావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. వెంకటరెడ్డి, వీరారెడ్డి, రవి, కుర్మారావు, చింతపల్లి సర్పంచి కృష్ణారావు పాల్గొన్నారు.

* పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని ఎన్డీ పార్టీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళగూడెంలో పార్టీ నూతన కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అచ్చయ్య, నాగన్న, పుల్లయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

* చింతపల్లికి చెందిన సీపీఎం నాయకుడు వేమన హనుమంతరావు(45) మృతి చెందాడు.నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు.. హనుమంతరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

* గొల్లగూడెంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు కొంపెల్లి రామయ్య గురుబ్రహ్మ అవార్డుకు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ సాహిత్య సాంస్కృతిక, సేవా సంస్థ జులై 5 గురుపౌర్ణమి సందర్భంగా సంస్థ ఈ అవార్డులను అందజేయనుంది. కొన్నేళ్లుగా సాహిత్యంలో కృషి చేస్తున్నందుకు తనకు అవార్డును ప్రకటించారని రామయ్య తెలిపారు.

* గ్రామాల్లో అక్రమ లేఅవుట్‌ల వివరాలు సేకరించి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జలగంనగర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్‌ మేళ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ వరప్రసాద్‌, సీపీవో రవీందర్‌రెడ్డి, జేపీవో భాస్కర్‌, సుడా డైరక్టర్‌ సంజీవరెడ్డి, తహసీల్దారు కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తిరుమలాయపాలెం, న్యూస్‌టుడే: పెట్రో ధరలను తగ్గించాలని జడ్పీటీసీ, కాంగ్రెస్‌ నాయకుడు బెల్లం శ్రీనివాసరావు తహసీల్దారు అరుణకి వినతిపత్రం అందజేశారు. అరవిందరెడ్డి, పాపానాయక్‌, లింగయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

* మండలకేంద్రానికి చెందిన ఎన్డీ సీనియర్‌ నాయకులు మద్దినేని సీతయ్య (85) అనారోగ్యంతో మృతి చెందారు. సీతయ్య అడుగుజాడల్లో పార్టీ శ్రేణులు నడవాలని ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.

నేలకొండపల్లి(ముదిగొండ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణకు నేలకొండపల్లిలోని మూల మలుపులు, పలు ప్రదేశాల్లో ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రమాద హెచ్చరిక స్టిక్కర్లు అంటించారు.

కూసుమంచి, న్యూస్‌టుడే: లింగారంతండాలో సర్పంచి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దోమల నివారణకు పొగ మందును పిచికారి చేశారు.

* పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు తహసీల్దారు కార్యాలయంలో ఉపతహసీల్దారుకు శనివారం వినతిపత్రం అందజేశారు. నాయకులు గురవయ్య, శ్రీనివాస్‌, హఫీజుద్ధీన్‌, వెంకన్న, శరత్‌గౌడ్‌, మైసయ్య, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


వైరా వార్తలు

విపత్కర సమయంలో ప్రజలపై భారం


వైరా: నిరసనలో పాల్గొన్న డీసీసీఅధ్యక్షుడు దుర్గాప్రసాద్‌

వైరా, న్యూస్‌టుడే: విపత్కర సమయంలో కేంద్రం వరుసగా పెట్రో ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తుందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం వద్ద పెట్రో ధరల పెంపు నిరసిస్తూ ఆందోళన చేశారు. సీతరాములు, దానియేలు, వెంకటనర్సిరెడ్డి, నర్సింహారావు, కృష్ణారావు పాల్గొన్నారు.

* ప్రతి ఒక్కరు సేవా దృక్పథం కల్గి ఉండాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లబ్‌ సమకూర్చిన రూ.50 వేల విలువైన పీపీఐ కిట్లు, ఎన్‌95 మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ జైపాల్‌, మురళీకృష్ణ, సీతరాములు, శ్యాంబాబు, ప్రభాకర్‌, కృష్ణమూర్తి, మధు, వెంకటయ్య పాల్గొన్నారు.

* జలాశయం ఆయకట్టులో అక్రమంగా తవ్విన చేపల చెరువును వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు కోరారు. ఆయకట్టు సమీక్షలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వివరించారు.

* తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్థంతిని బోడేపూడి భవన్‌లో నిర్వహించారు.

* మైనార్టీలు, దూదేకులు, ఎంబీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దూదేకుల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.

కొణిజర్ల, న్యూస్‌టుడే: పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన నిర్వహించారు. కొణిజర్ల సర్పంచి సూరంపల్లి రామారావు, నాయకులు నారాయణరావు, సౌజన్య, రమేశ్‌, ఎంపీటీసీ కృష్ణార్జునరావు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.

కారేపల్లి, న్యూస్‌టుడే: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు చంద్రప్రకాశ్‌, తాజుద్దీన్‌ తహసీల్దార్‌ పుల్లయ్యకు వినతిపత్రం అందించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.