close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మధిర ముచ్చట్లు

తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత


తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మధిర, న్యూస్‌టుడే: కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచటంపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్‌కు పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సూరంశెట్టి కిశోర్‌, ఎం.వి.రమణగుప్తా, వాసు, బాలరాజు, జహంగీర తదితరులు పాల్గొన్నారు.

ముదిగొండ, న్యూస్‌టుడే: తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. రమేశ్‌బాబు, నాగేశ్వరరావు, దేవేంద్రం పాల్గొన్నారు.

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా చేశారు. తహసీల్దార్‌ ఎండీ ముజాహిద్‌కు వినతిపత్రం అందించారు. సుధాకర్‌రెడ్డి, నరసింహారావు పాల్గొన్నారు.

బోనకల్లు, న్యూస్‌టుడే: బోనకల్లులో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో జడ్పీటీసీ సుధీర్‌బాబు, కిషోర్‌, దుర్గారావు పాల్గొన్నారు.

చింతకాని, న్యూస్‌టుడే: చింతకానిలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, కన్నెబోయిన గోపి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

* దెందుకూరు పంచాయతీ సిబ్బందికి మధిర సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం శానిటైజర్లు, మాస్క్‌లు, రేడియం యాప్‌రాన్‌లు వ్యాపారవేత్త మిరియాల కాశీవిశ్వేశ్వరరావు వితరణతో పంపిణీ చేశారు.

* మత్కేపల్లి నామవరంలో ఎస్సీలకు చెందిన శ్మశాన వాటిక స్థలం కబ్జా అయిందంటూ గ్రామస్థులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. ఉప తహసీల్దార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

మధిర పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన గడ్డం భద్రయ్య జన్మదినం సందర్భంగా రిక్రియేషన్‌ క్లబ్‌ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు, తెరాస జిల్లా నాయకులు చెరుకూరి నాగార్జున్‌ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.


సత్తుపల్లి సమాచారం


తల్లాడ - భద్రాచలం ప్రధాన రహదారిలో పడిపోయిన చెట్టు

కల్లూరు, న్యూస్‌టుడే: కల్లూరు పట్టణ కేంద్రంలో ఆర్టీసీ కార్గో కొరియర్‌ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్‌ వెంకటేశ్వరబాబు తెలిపారు. పంచాయతీ సముదాయాల్లో గది కేటాయింపుపై సర్పంచి నీరజతో శనివారం చర్చించారు.

సత్తుపల్లి, న్యూస్‌టుడే: బేతుపల్లిలో హోం క్వారంటైన్‌లో పేద కుటుంబాలకు నవ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, కూరగాయలను శనివారం ఏర్పాటు చేశారు.

* చెరుకుపల్లిలో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు చూడి పాడి గేదె మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని యజమాని ఒగ్గెల శ్రీను శనివారం తెలిపారు.

* పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు త్వరితగతిన భూసేకరణ చేయాలని ఎంపీపీ దొడ్డా హైమవతి పేర్కొన్నారు. బేతుపల్లిలో శనివారం ఎంపీడీవో సుభాషిణి, సర్పంచి శ్రీనివాసరావుతో కలిసి ప్రకృతి వనాల ఏర్పాటుకు భూమిని పరిశీలించారు.

సత్తుపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సత్తుపల్లి ఎల్‌ఐసీ మేనేజర్‌ ఆనందరావు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో సిబ్బంది శనివారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు.

తల్లాడ, న్యూస్‌టుడే: శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి తల్లాడ- భద్రాచలం ప్రధాన రహదారిలో ఓ భారీ వృక్షం పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పోలీసుల సాయంతో వృక్షాన్ని తొలగించారు.


అశ్వారావుపేట సమాచారం

అశ్వారావుపేటలో భారీ వర్షం


చంద్రుగొండలో పంటపొలాల్లోకి చేరిన వర్షపు నీరు

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: అశ్వారావుపేటలో 11.5 సెం.మీ.వర్షపాతం నమోదైంది.

చంద్రుగొండ: మండలంలో 49.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి తిప్పనపల్లిలోని ఓ వ్యక్తి ఇంట్లో పశువుల పాక కూలింది.

కరోనా కట్టడికి స్వీయ జాగ్రత్తలు పాటించాలి

ములకలపల్లి, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔషధ నియంత్రణాధికారి బాలకృష్ణ అన్నారు. జగన్నాథపురంలోని ఔషధ దుకాణాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: హరితహారంలో భాగంగా నారాయణపురంలో తెరాస నాయకులు, గ్రామ పెద్దలతో కలసి శనివారం డీసీసీబీ డైరెక్టర్‌ నిర్మల పుల్లారావు మొక్కలు నాటారు.

చంద్రుగొండ: గానుగపాడులో పంచాయతీ ప్రత్యేకాధికారి సాయమ్మ ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.