close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్తగూడెం కబుర్లు

పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా


పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ నేతృథ్వంలో పురపాలక కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పురపాలక కమిషనర్‌ ఎ.సంపత్‌కుమార్‌కు వినతిపత్రం అందచేశారు. మోత్కూరి ధర్మారావు, ఉమ్మడి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దేవీప్రసన్న, కౌన్సిలర్‌ లక్ష్మణ్‌, భద్రం పాల్గొన్నారు. ● సుజాతనగర్‌: జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు నాగ సీతారాములు ఆధ్వర్యంలో సుజాతనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజశేఖర్‌, ఎంపీటీసీ వీరభద్రం, శ్రీనివాస్‌, అబీద్‌, చంటి పాల్గొన్నారు.

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కొత్తగూడెం అదనపు జిల్లా న్యాయమూర్తి అబ్ధుల్‌ రఫీ మొక్కలు నాటారు. న్యాయమూర్తులు శ్రీనివాస్‌, శిరీష, దేవీమానస, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కార్యదర్శి గోపీీకృష్ణ, అటవీశాఖ అధికారులు అప్పయ్య, సురేష్‌ పాల్గొన్నారు.

కార్యాలయ వేళలు కుదింపు

పాల్వంచ (కేటీపీఎస్‌): కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లో కరోనా ప్రభావం కారణంగా పాల్వంచ కేటీపీఎస్‌ ఉద్యోగుల సహకార పరపతి సంఘం కార్యాలయ పనివేళలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కుదించినట్లు పాలకవర్గం ఓ ప్రకటనలో పేర్కొంది.

చుంచుపల్లి: గ్రామాల్లో తరుణ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర నాయకుడు రంగా కిరణ్‌ కోరారు. శనివారం చుంచుపల్లిలో పర్యటించారు.

‘స్వేరోస్‌ అధ్యక్షునిగా వీరయ్య’

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ‘స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌’ నూతన అధ్యక్షుడిగా చిలకబత్తిని వీరయ్య నియమితులయ్యారు. స్వేరోస్‌కు వీరయ్య అందించిన సేవలను ఆ సంఘం సెంట్రల్‌, రాష్ట్ర కమిటీ గుర్తించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకోలు

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘మిషన్‌ భగీరథ’ పథకంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసిన తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్‌ ఏవో పి.గన్యాకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు వినతిపత్రం అందించారు.

పాల్వంచ పట్టణం: చంద్రాలగూడెంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపునకు శనివారం తహసీల్దారు భగవాన్‌రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. పేదలకు అన్యాయం జరిగిందని మాజీ మావోయిస్టు సమ్మక్క ఆరోపించారు.

వంద శాతం క్షయ కేసులను గుర్తించాలి

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని క్షయ బాధితులందరినీ గుర్తించాలని కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ యోగితారాణి సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆయా విభాగాల ప్రోగ్రాం అధికారులతో శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష జరిపారు. డీఎంహెచ్‌ఓ డా.ఎల్‌.భాస్కర్‌నాయక్‌, అధికారులు డా.నరేశ్‌కుమార్‌, ప్రసాద్‌, శ్రీను, స్వాతి పాల్గొన్నారు.

చుంచుపల్లి: బాబుక్యాంప్‌ కనకదుర్గ దేవాలయంలో అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు.


పినపాక ముచ్చట్లు

ఏడో ఆర్థికగణన కార్యక్రమం ప్రారంభం


మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

బూర్గంపాడు, న్యూస్‌టుడే: బూర్గంపాడులో ఒకేషనల్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. స్థానిక జూనియర్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికులు డా.చెన్నం సత్యనారాయణ, చెన్నం సూర్యప్రసాద్‌ సోదరులు కళాశాల నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వడానికి ముందుకు రావడంతో వారిని అభినందించారు. కళాశాల చైర్మన్‌గా కాంతారావును ఎన్నుకున్నారు. జడ్పీటీసీ శ్రీలత, సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, నోడల్‌ అధికారి జహీర్‌అహ్మద్‌, తహసీల్దార్‌ కిషోర్‌, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ప్రత్యేక అధికారి చంద్రప్రకాష్‌, లోకేశ్‌, ప్రిన్సిపల్‌ ఆర్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అశ్వాపురం, న్యూస్‌టుడే: మొండికుంటలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

బూర్గంపాడు, న్యూస్‌టుడే: మండల పరిషత్‌ ప్రత్యేక అధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీటీసీ శ్రీలత, సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీడీవో ఆర్వీ సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు. ● పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బూర్గంపాడు తహసీల్దార్‌ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు.

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌కి శనివారం వినతిపత్రం అందజేశారు.

* పెరిగిన పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు.


ఇల్లెందు వార్తలు

న్యాయం జరిగే వరకు పోరాటం


భూములకు సంబంధించిన పట్టాలు చూపుతున్న రైతులు

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: మామిడిగుండాల పరిధిలో పట్టా హక్కులు కలిగిన తమకే భూములు ఇవ్వాలని శనివారం మామిడిగుండాల, సేవ్యాతండా, ధనియాలపాడు, బోటిగుంపు, బాలాజీతండలకు చెందిన గిరిజనులు శనివారం డిమాండ్‌ చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన సదస్సును రద్దు చేసి గ్రామాలలో భూములకు సంబంధించి తమ పట్టాలను ప్రదర్శించారు.

* కరోనా కేసులు దృష్ట్యా విత్తనాల, ఎరువుల కొనుగోలుకు వచ్చే రైతులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాన్నం 3 వరకే దుకాణాలు కొనసాగిస్తున్న విషయాన్ని గ్రహించాలని దుకాణదారులు తెలిపారు. 3 గంటలలోపే కొనుగోలు చేసేలా రావాలని కోరారు.

‘1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తున్న  వారిపై కేసు నమోదు చేయాలి’

రొంపేడు పంచాయతీ పరిధిలోని బొల్లినగర్‌ 588 సర్వే నెంబర్‌లో గల 5 ఎకరాల భూమిని 1/70 చట్టానికి విరుద్ధంగా విక్రయించే గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలి శనివారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులు తహసీల్దార్‌ మస్తాన్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు.

టేకులపల్లి, న్యూస్‌టుడే: యువత అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలని లచ్చాతండా-సింగ్యాతండా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బోడా గన్నా పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శనివారం నిర్వహించారు. నాయకులు నరేందర్‌, మంగీలాల్‌, మోహన్‌, నాగేశ్వరరావు, హరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పురపాలక స్థలాలు ఆక్రమించే వారిపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని పురపాలక ఛైర్మన్‌ డీవీ తెలిపారు. స్థానిక చెరువు కట్ట వద్ద బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఫిల్టర్‌బెడ్‌కు ఆనుకుని ఆక్రమణకు గురవుతున్న పురపాలక స్థలాన్ని ఛైర్మన్‌ పరిశీలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.