close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బతుకు చిత్రం

కట్టుకున్నా నేలమట్టం..!

రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న ఇళ్లు రోడ్డు విస్తరణలో నేలమట్టమయ్యాయి. సొంత గూడు చెదిరిన వారు ఇప్పుడు ఓ కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. ఇక్కడ కనీసం మరుగుదొడ్డి సదుపాయమూ లేదు. రెండేళ్ల క్రితం రహదారి వెడల్పులో భాగంగా ఖమ్మం నగరం 8వ డివిజన్‌ గొల్లగూడేనికి చెందిన మూడు కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. షేక్‌ మదార్‌బీ, షేక్‌ మహబూబ్‌బీ, చింతల కుమారిల ఇళ్లను కూల్చివేయటంతో వారు రోడ్డునపడ్డారు. పరిహారం కింద రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని, అంతదాకా డివిజన్‌ కార్యాలయంలో ఉండాలని చెప్పారు. ఇప్పటికి రెండేళ్లు గడుస్తున్నా వారిని పట్టించుకున్న నాథుడే లేరు. చింతల కుమారికి భర్త లేడు. ఇద్దరు ఆడపిల్లలు. కూలీ చేసుకుని జీవిస్తున్నారు.

- ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే


కట్టపైనే కన్న..తల్లీ..!

మణుగూరు పురపాలక కార్యాలయం ఎదుట ఉండే చెరువును నిత్యం చూసేవారికి ఆ జలాశయమే కాదు.. కట్టపై కట్టుబట్టలతో నివసించే ఓ తల్లి, ఇద్దరు పిల్లలూ కనిపిస్తుంటారు. ఈ కట్టపైనే తన పిల్లలకు జన్మనిచ్చింది. ఆ మాతృమూర్తి.. పేరు ధనలక్ష్మి. దివ్యాంగుడైన భర్త వీరభద్రం ఏడాది క్రితమే మరణించాడు. అతను బతికున్న సమయంలో రెండు పడక గదుల గృహం ఇప్పించాలని నిత్యం కార్యాలయం చుట్టూ తిరిగేవాడు. ధనలక్ష్మి పిల్లలతో కలిసి చెరువు కట్టపైనే నివసిస్తోంది. భర్త పోయాక యాచన చేస్తూ జీవిస్తోంది. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ కాలం వెళ్లదీస్తున్న ఈ కుటుంబానికి మానవతా దృక్పథంతో స్పందిస్తే ఆవాస సదుపాయం దక్కుతుంది.

- మణుగూరు, న్యూస్‌టుడే


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.