close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైభవంగా నిత్య కల్యాణోత్సవం
భద్రాచలం ముఖ్యాంశాలు
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన పూజల్లో పాల్గొన్న భాజపా
నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోనేరు చిన్ని

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయం పరిసరాలు బుధవారం శ్రీరామ నామాలు, ఆధ్యాత్మిక భావంతో అలరారాయి. అంతరాలయంలో నిత్యకల్యాణం వైభవంగా సాక్షాత్కరించింది. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ నిర్వహించి మాంగళ్యధారణను నయనానందంగా చేశారు. తలంబ్రాల వేడుక పరమానందాన్ని పంచింది.

స్నాన ఘట్టాల్లో ప్రత్యేక పూజలు

భద్రాచలం అంబేడ్కర్‌ సెంటర్‌: శ్రీగౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘం భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు రామావఝుల రవికుమార్‌ పేర్కొన్నారు. బుధవారం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ నేపథ్యంలో రామునిపై మక్కువతో తాము ప్రత్యేక పూజలు చేశామన్నారు.

● కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డా.భానుప్రసాద్‌, రమణయ్య, లరాజా తదితరులు ఏఎంసీ కాలనీలో నిర్వహించిన సమావేశంలో డిమాండ్‌ చేశారు.

సుభిక్షంగా చూడు స్వామీ..

చర్ల: రైసుపేటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్థానిక పెద్దలు చీమకుర్తి వీరభద్రం, ఆలయ అర్చకులు శేఖర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

పోస్టులు కేటాయించాలి

భద్రాచలం: వివిధ నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే పోస్టులను కేటాయించాలని టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ ముందు ధర్నా చేశారు. పూల్‌సింగ్‌, బాలకృష్ణ, మోహన్‌, రవి, పార్వతి, పూజిత పాల్గొన్నారు.

* గ్రీన్‌ భద్రాద్రి ఆధ్వర్యంలో బుధవారం పలుచోట్ల మొక్కలు నాటారు. బోగాల భూపతిరెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని ఆయన తండ్రి శ్రీనివాసరెడ్డి స్థానిక గ్రీన్‌ భద్రాద్రికి మొక్కలు నాటేందుకు రూ.పది వేల నగదు అందజేశారు.

దుమ్ముగూడెం: అంజుబాకలోని ములకపాడు సీపీఎం కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సున్నం రాజయ్య సంతాప సభ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యలమంచి రవికుమార్‌, టీఏజీఎస్‌ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

* లక్ష్మీనగరంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 9వ తేదీ వరకు గిరిజన గూడేల్లో జెండావిష్కరణ చేయాలన్నారు. కామరాజు, నాగేశ్వరరావు, మల్లుదొర పాల్గొన్నారు.

ఆత్మారామాలయంలో పూజలు..

అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా దుమ్ముగూడెం మండల కేంద్రంలోని శ్రీఆత్మారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి సత్యనారాయణమూర్తి, రామభక్తులు కెల్లా శేఖర్‌, గంగా శ్రీనివాస్‌, త్రినాథ్‌, విశ్వ, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.