close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ

మధిర ముచ్చట్లు

మధిర మార్కెట్‌యార్డు ఎదుట ధర్నా చేస్తున్న హమాలీలు, నాయకులు

మధిర, న్యూస్‌టుడే: హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మధిర మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న హమాలీ కూలీలు గురువారం ధర్నా నిర్వహించి సమ్మెలోకి దిగారు. కార్యక్రమంలో యర్రా శ్రీకాంత్‌, నర్సింహారావు, గాంధీ, రాధాకృష్ణ, కృష్ణారావు, మురళి పాల్గొన్నారు.

* కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పుట్టినరోజు వేడుకలను గురువారం కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో రేణుకాచౌదరి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

* 21వ వార్డులో కరోనా సోకిన కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కౌన్సిలర్‌ యర్రగుంట లక్ష్మి అందజేశారు. మధిరలోని ఏడీఈ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులు శానిటేషన్‌ చేయించారు.

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: దెందుకూరు, కృష్ణాపురం గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో గురువారం ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచులు కోట విజయశాంతి, బుర్రి సునీత పాల్గొన్నారు.

* వర్షాలకు కృష్ణాపురం ప్రధాన రహదారి పక్కన చెట్టు విరిగి పడటంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.

బోనకల్లు, న్యూస్‌టుడే: ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరుతూ మండలంలోని గోవిందాపురం(ఎల్‌)లో ఆ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లోని ప్రైవేటు స్కూల్‌ల్లో పనిచేస్తున్న శివాణి అర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సంఘం అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌మీరా డిమాండ్‌ చేశారు.

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: దేవాదాయశాఖ ఆదేశాల మేరకు జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో గురువారం హరితహారం నిర్వహించారు. కొండపై పర్యవేక్షకుడు బి.శ్రీనివాస్‌, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది మొక్కలు నాటారు.

ముదిగొండ, న్యూస్‌టుడే: పమ్మి, మల్లన్నపాలెం గ్రామాల్లో గురువారం ఎంపీడీవో శ్రీనివాసరావు పర్యటించారు. మల్లన్నపాలెంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు.

* మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బాణాపురం, చిరుమర్రి చెరువులకు జలకళ వచ్చింది.

చింతకాని, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తూము కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు వీరభద్రం, సీతంపేట సర్పంచి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.