close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి

పాలేరు సమాచారం

మండ్రాజుపల్లిలో రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలిస్తున్న నల్లమల 

రనేలకొండపల్లి(ముదిగొండ), న్యూస్‌టుడే: రైతువేదికల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని నేలకొండపల్లి, నాచేపల్లి, చెరువుమాధారం, రాజేశ్వరపురం, సుర్థేపల్లి, ముజ్జుగూడెం, కొంగర, మండ్రాజుపల్లి గ్రామాల్లో నిర్మాణం జరుగుతున్న రైతువేదికల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. యడవల్లి సైదులు, ఏవో నారాయణరావు, సర్పంచులు నవీన్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

* కరోనా కాలంలో ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలలు తెరవాలనే ఆలోచన విరమించుకోవాలని యువజన కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు జెర్రిపోతుల అంజని అన్నారు. నేలకొండపల్లిలో గురువారం విలేకరులతో మాట్లాడారు.

* నేలకొండపల్లిలోని 6, 5, 10 వార్డులను కంటైన్మెంటు జోన్లుగా గుర్తించినట్లు తహసీల్దార్‌ వీరభద్రం తెలిపారు.

* కరోనాను జయించి గురువారం విధులకు హాజరైన నేలకొండపల్లి ఏఎస్‌ఐ రాఘవయ్యకు ఎస్‌ఐ అశోక్‌, కానిస్టేబుల్‌లు పూలుజల్లి స్వాగతం పలికారు.

నేడు ప్రమాణ స్వీకారం: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెఫఫట్‌ కమిటీ నూతన పాలవకర్గం ప్రమాణస్వీకారం మహోత్సవం శుక్రవారం మార్కెట్‌యార్డులో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం.

కూసుమంచి, న్యూస్‌టుడే: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూసుమంచి మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఈ వర్షంతో పత్తి, వరి, ఇతర పండ్లతోటలు, కూరగాయల పైర్లకూ ఉపయుక్తంగా నిలిచింది.

* భారీ వర్షంతో వరద ఎస్సారెస్పీ కాలువలోకి మళ్లడంతో అది నిండుగా ప్రవహించింది. నేలపట్ల శివారు ప్రాంతంలో కాలువ ఆగిపోవడంతో వరదనీరు కట్టల పైనుంచి పొర్లి పొలాల్లోకి ప్రవహించాయి.

* నాయకన్‌గూడెంలో ఇటీవల హఠాన్మరణం చెందిన సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శించారు.

వైద్యబృందం సందర్శన: కరోనా పీడితులు ధైర్యంగా ఉంటూ ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. పాలేరులో పెద్ద సంఖ్యలో కొవిడ్‌-19 బాధితులతో ఉన్న ఎస్టీకాలనీ కంటైన్‌మెంట్‌జోన్‌, గ్రామంలోని పలువురు బాధితుల నివాసాలను వైద్యాధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైద్యబృందం గురువారం సందర్శించింది.

డ్రమ్‌సీడర్‌తో విత్తడం మేలు: డ్రమ్‌సీడర్‌తో పొలంలో వరి విత్తనాలను నేరుగా విత్తుకునే విధానం రైతులకు లాభదాయకమని ఏడీఏ విజయచంద్ర అన్నారు. గైగొళ్లపల్లిలో డ్రమ్‌సీడర్‌తో సాగుచేసిన క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఏవో వాణి, సర్పంచి శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.