close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిమ్మపూడిలో వెంకటరెడ్డి స్తూపం ఆవిష్కరణ

ఖమ్మం కబుర్లు


వెంకటరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రఘునాథపాలెం మండల అధ్యక్షుని సంస్మరణ సభ గురువారం చిమ్మపూడి గ్రామంలో జరిగింది. వెంకటరెడ్డి స్తూపాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆవిష్కరించారు. మాజీ మంత్రి రేణకాచౌదరి వెంకటరెడ్డి కుటుంబాన్ని చరవాణిలో పరామర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మానుకొండ రాధాకిశోర్‌, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

భట్టి నివాళి: అనంతరం వెంకటరెడ్డి నివాసాన్ని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ సందర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండదండలు కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమాల్లో నాయకులు మలీదు వెంకటేశ్వరరావు, జావీదు, షేక్‌ మీరాసాహెబ్‌, దీపక్‌నాయక్‌, రామోజుల వెంకన్న, బాణోతు కోటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన మిరపనారును అందించాలి: సహాయ కలెక్టరు (రఘునాథపాలెం, న్యూస్‌టుడే): నాణ్యమైన మిరప నారును రైతులకు అందించాలని సహాయ కలెక్టరు వరుణ్‌రెడ్డి నర్సరీల నిర్వాహకులకు సూచించారు. మండలంలో గురువారం ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంచుకొండలో నిర్వహిస్తున్న ప్రైవేటు మిర్చి నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీ లైసెన్సును, రిజిస్టరును, ట్రేలలో పెంచుతున్న మిర్చి, టమాటా, వంగ నారును తనిఖీ చేశారు. అనంతరం రాంక్యాతండాలో ఇద్దరు యువ రైతులు సాగు చేస్తున్న అల్లం పైరును పరిశీలించారు. సంప్రదాయేతర పంటల సాగు చేపట్టిన రైతులను, ప్రోత్సహించిన ఉద్యాన అధికారి సందీప్‌ను అభినందించారు. హెచ్‌వో నగేశ్‌, నర్సరీ యజమాని మల్లేశ్‌, రైతులు పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిశీలన (గాంధీచౌక్‌, న్యూస్‌టుడే): మైనార్టీస్‌ డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ 2019-20 కోసం దరఖాస్తులు సమర్పించిన మైనార్టీ అభ్యర్థులకు(క్రైస్తవులు మినహా) జిల్లా స్థాయి క్యాంపు (ధ్రువపత్రాల పరిశీలన) ఈనెల 17 నుంచి 19 వరకు ఖమ్మం జలగంనగర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు ఒరిజినల్స్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌ ఫొటోలు తీసుకొని హాజరు కావాలని తెలిపారు.

ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం (ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే): తల్లాడ మండలం మంగాపురంలో రామాలయ నిర్మాణానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేయగా ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, జి.వెంకటేశ్వర్లు ఉన్నారు.


రేణుకాచౌదరి జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న నాయకులు

రేణుక జన్మదిన వేడుకలు (ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే): కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి జన్మదిన వేడుకలను ఖమ్మం డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో గురువారం నిర్వహించారు. నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగండ్ల దీపక్‌చౌదరి, కార్పొరేటర్‌ వడ్డెబోయిన నర్సింహారావు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. నాయకులు బత్తుల ప్రతాప్‌రుద్ర, చోటాబాబా, శ్రీనివాసరెడ్డి, సాయితేజ పాల్గొన్నారు.

నేతలకు నివాళి..: ఇటీవల మరణించిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, నాయకులు కోటేరు వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మోహన్‌రావు (ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే): సమాజ్‌వాది పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం గుర్రాలపాడుకు చెందిన యాదండ్ల మోహన్‌రావును నియమించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య సింహాద్రి, కార్యదర్శి బాబుగౌడ్‌ గురువారం నియామక పత్రం అందించినట్లు మోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. మోహన్‌రావు గతంలో తెజస నగర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: ఆయాసం, నీరసంతో బాధపడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఆర్టీసీ ఆసుపత్రిలో డా.గిరిసింహారావు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతమంది ఉద్యోగులకు 6మినిట్‌ వాకింగ్‌ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయాసం, నీరసం, దగ్గు, మధుమేహం, గుండె, మూత్రపిండ సంబంధిత జబ్బులు, ఆస్తమా రోగులకు పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎంతో ఉపయోగకరమన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.