close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటితో ముగియనున్న ఉపాధ్యాయ ‘ఆన్‌లైన్‌ శిక్షణ’

ఈనాడు, ఖమ్మం: కరోనా కాటుతో పాఠశాలలు మూతపడ్డాయి. మళ్లీ బడిగంట ఎప్పుడు మోగుతుందనేని ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధ్యాయులకు బోధనాపరంగా అవసరమైన సాంకేతికతతో కూడుకున్న బోధనా వ్యూహాలు నేర్పించేందుకు జిల్లా విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాలు మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నెల 6న శ్రీకారం చుట్టిన ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన చేయాల్సి వస్తే ఏవిధంగా సంసిద్ధంగా ఉండాలి? సాంకేతిక అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పూనుకుంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు చేపట్టిన శిక్షణ శుక్రవారంతో ముగియనుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.