close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలగిన సందిగ్ధం

గణేశ్‌ నవరాత్రులపై ‘స్తంభాద్రి’ సమితి సూచనలు


స్తంభాద్రి సమితి బాధ్యుడు వినోద్‌ లాహోటీ

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సందిగ్ధతకు తెరతొలగింది. ‘విగ్రహమా.. నిగ్రహమా?’ శీర్షికన ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యులను సంప్రదించి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించుకునేలా ప్రణాళిక రూపొందించి వాటి వివరాలకు మీడియాకు వెల్లడించారు. పలు ప్రాంతాల్లోని ఉత్సవ కమిటీలు నిర్వహణకు సుముఖంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోద్‌లాహోటీ పేర్కొన్నారు. ఏటా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5 వేలకు పైగా విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా ఈసారి వెయ్యి లోపు మాత్రమే ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

మండపాల్లో పాటించాల్సిన నిబంధనలు ఇవే...

* మట్టి విగ్రహాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం.

* భౌతిక దూరం, శానిటైజర్‌, మాస్కుల వాడకం తప్పనిసరి. అవి లేకుండా దర్శనానికి అనుమతించరాదు.

* భారీ విగ్రహాలు, సెట్టింగ్‌లను ఏర్పాటు చేయకూడదు.

* అర్చకునితో పాటు ఆ రోజు పూజలు నిర్వహించే దంపతులు మాత్రమే కూర్చోవాలి.

* మైక్‌, సౌండ్‌బాక్సులను ఏర్పాటు చేయరాదు.

* సామూహిక కుంకుమపూజలు, సరస్వతి పూజలు నిర్వహించకూడదు.

* భజన కార్యక్రమాలను రద్దు చేయాలి. లడ్డూ ప్రసాదం వేలం పాట జరపకూడదు.

* భక్తులకు ప్రసాదాల పంపిణీ జరుపరాదు.

* ఒకరిద్దరిని మాత్రమే వేదికపైకి అనుమతించాలి.

* గణేశ్‌ దీక్షధారులకు, సాధారణ భక్తులకు అన్నదాన కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలి.

* సామూహిక నిమజ్జనానికి అనుమతిలేదు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ట్రాక్టర్‌ డ్రైవర్‌తోపాటు ఇద్దరు మాత్రమే పాల్గొనాలి.

* ఉత్సవాలను నిర్వహించే వారి వివరాలను సమీప పోలీస్‌స్టేషన్‌కు అందించాలి.

* అవకాశాన్ని బట్టి ఉత్సవాలను మూడోరోజు గానీ, ఐదవ రోజుగానీ ముగించాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.