close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలి

జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య


స్థాయీసంఘాల సమావేశంలో జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య

కొత్తగూడెం (రామవరం), న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తితో పాటు తరుణ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని, ఎక్కడా మురుగు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య అధికారులకు సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో అధికారులు, జడ్పీ సభ్యులు నామమాత్రంగానే హాజరయ్యారు. దీంతో సంఘాల సమావేశాలు సాదాసీదాగా ముగిశాయి. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షుడు కోరం మాట్లాడుతూ ప్రజారోగ్యంపై గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సర్పంచులు, కార్యదర్శులు సమష్టి కృషితో అవగాహన కలిగించాలన్నారు. బ్లీచింగ్‌ పౌడరు నిల్వలు తగినంత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టేకులపల్లి, ములకలపల్లి మండలాల్లో నిల్వ నీటి కారణంగా జ్వరాలు ప్రబలే అవకాశముందని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. జిల్లా వైద్యాధికారి డా.భాస్కర్‌నాయక్‌ మాట్లాడుతూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై కొవిడ్‌ అధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రసూతి కేసులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో భూగర్భ జలాలు 2.5 మీటర్లు పెరిగినట్లు భూగర్భజల వనరుల జిల్లా అధికారి స్వామి వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి ప్రభుత్వ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి డిజిటల్‌ పాఠాలను బోధిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ పరీక్షల అధికారి రామేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయులు ఈ నెల 17 నుంచి పాఠశాలలకు హాజరవుతారన్నారు. జడ్పీ ఉప సీఈవో సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రకృతి వనాల ఏర్పాటుకు 85 శాతం భూ కేటాయింపులు పూర్తిచేసినట్లు చెప్పారు. సమావేశాల్లో జడ్పీ ఉపాధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖరరావు, పూర్వ ఖమ్మం జడ్పీ మాజీ అధ్యక్షుడు బరపటి వాసుదేవరావు, సీఈవో డి.పురుషోత్తం, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.