close

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

ప్రధానాంశాలు

మూడు కాకపోతే మొబైల్‌ రాజధాని పెట్టండి

సీమ ప్రజలను సీఎం మభ్యపెడుతున్నారు

● తెదేపా నేతల ధ్వజం


శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా నేతలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని ముక్కలు చేస్తూ.. కర్నూలుకు హైకోర్టు అంటూ రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలని అనుకుంటున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శాసనమండలి ఛైర్మన్‌ ఎం.ఎ. షరీఫ్‌ పట్ల రాష్ట్ర మంత్రుల ప్రవర్తన అధ్వానమని చెప్పారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయనతోపాటు ఎమ్మెల్సీలు ఎన్‌ఎండీ ఫరూఖ్‌, కేఈ ప్రభాకర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్‌, కర్నూలు తెదేపా బాధ్యుడు టీజీ భరత్‌ ఆధ్వర్యంలో శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఆర్‌డీఏ, అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన మండలి ఛైర్మన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ అమరావతిని మార్చాలనుకుంటే కర్నూలును రాజధానిగా ప్రకటించాలని, లేకుంటే గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మంత్రులు బొత్స, ఇతర మంత్రులు శాసనమండలి ఛైర్మన్‌ పోడియం వద్దకెళ్లి రాయడానికి వీలులేని విధంగా దూషించిన విషయమై ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు కాకపోతే మొబైల్‌ రాజధాని పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పెద్దల సభలో వైకాపా వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూఖ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజా విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇకనైనా రాజధాని మార్పు అంశాన్ని విరమించుకోవాలని చెప్పారు. ప్రజల కోరికమేరకు శాసనసభను సైతం రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సవాల్‌ విసిరారు. కర్నూలు తెదేపా బాధ్యుడు టీజీ భరత్‌ మాట్లాడుతూ రాజధానిని మార్చడం వల్ల సీమ ప్రజలకు చాలా దూరాభారమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి తక్షణమే విరమించుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి అభివృద్ధికి దోహదపడాలన్నారు. కర్నూలులో పూర్తిస్థాయి హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. రాజధానిని మార్చాలనుకుంటే కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్నారు. శాసనమండలిలో తన వాదనలను బలంగా వినిపించిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, తెదేపా నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఆకెపోగు ప్రభాకర్‌, రవికుమార్‌, మాజీ ఎంపీపీలు బాలవెంకటేశ్వరరెడ్డి, పర్ల పెద్ద అమీన్‌, జె.తిరుపాల్‌బాబు, అబ్బాస్‌, జేమ్స్‌, బషీర్‌, మౌలాలి, చిన్నటేకూరు రామాంజనేయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

బళ్లారి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్న తేజస్విరావు (54) శుక్రవారం మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చింతకుంట గ్రామానికి చెందిన తేజస్విరావు అక్టోబరు 15న కారులో వెళ్తుండగా, బళ్లారిలోని పోలా హోటల్‌ ముందు మరో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి విమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సంచార పోలీసులు విమ్స్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పైవివరాలు సి.ఐ. నాగరాజు తెలిపారు.

భోజన పథకానికి అందుబాటులో లేని గుడ్డు

అవుకు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. నాలుగురోజులు గడిచినా బాలారిష్టాలను అధిగమించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుడ్డు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు సాధారణ భోజనంతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలల వారీగా మండలంలో నాలుగు రోజుల నుంచి చిక్కీలతో పథకాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాకు కేటాయించిన ఏజెన్సీ నుంచి గుడ్డు సమకూరకపోవడమే సమస్యకు కారణమని విద్యాధికారి శ్రీధర్‌రావు తెలిపారు. పథకం అమలులో గుడ్డు లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.