close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

104, 108 వాహనాలతో ఆరోగ్య భద్రత

వాహనాలను ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి

ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం...

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతిఒక్కరికి వైద్యం అందించి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే 104, 108 వాహనాలను ముఖ్యమంత్రి అన్ని మండలాలకు మంజూరు చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 116 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎంపీలు డా.సంజీవ్‌కుమార్‌, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, ఆర్థర్‌, కంగాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అధునాతన సాంకేతికతతో కూడిన 108, 104 వాహనాలను సమకూర్చారన్నారు. ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ మట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. కాటసాని మాట్లాడుతూ అత్యవసర వైద్యంలో 108 వాహనం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అనంతరం నగరంలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం అందించే ప్రతి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగపరుచుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా గురువారం కార్మిక శాఖ జోనల్‌ కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారిలో 9 లక్షలమంది మత్రమే సంబంధిత ధ్రువపత్రాలను కార్యాలయాల్లో అందించారన్నారు. వాటితో రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడానికి సులభతరంగా ఉంటుందన్నారు. జిల్లాల వారిగా ఏఏ పనులకు వెళ్లే కార్మికులు ఉన్నారో వివరాలు సేకరించి రానున్న రోజుల్లో వారికి సేఫ్టీ కిట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాలలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. కుటుంబానికి బ్యాంకు బాండ్లను ఈ సందర్భంగా అందించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందిస్తూ తప్పుచేసిన వారు తప్పించుకోలేరన్నారు. అనంతరం కార్మిక శాఖ సంయుక్త కమిషనరు ఎస్‌.వై.శ్రీనివాస్‌తో కలిసి సిబ్బందికి కరోనా పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సంఘాల నాయకులు ఆయనకు ఈ సందర్భంగా వినతిపత్రాలు సమర్పించారు. సంయుక్త కమిషనర్‌ ఎస్‌.వై.శ్రీవివాస్‌, ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, డీసీఎల్‌ శేషగిరిరావు, అధికారులు కేశన్న, సుందరేష్‌, విద్యావతమ్మ, శ్రీలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


మంత్రి నుంచి అందుకున్న ఎఫ్‌డీ బాండ్లను చూపుతున్న కార్మికుడి కుటుంబ సభ్యులు

నగరంలో వాహనాలతో ర్యాలీ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.