close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లాస్టిక్‌ భూతం.. పర్యావరణం కాలుష్యం

అమలు కాని నిషేధ] ఆంక్షలు
చాటుమాటున విక్రయాలు 

కర్నూలు (బుధవారపేట, వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే: నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం ఆచరణకు నోచుకోవడం లేదు. 2019 అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. 
నగరంలో 102 కాలనీల్లో సుమారు 6 లక్షల జనాభా నివాసం ఉంటోంది. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా.. కన్పించవు. పాతబస్తీ, ఎన్‌ఆర్‌పేట, బుధవారపేట, రాజ్‌విహార్, గాయత్రి ఎస్టేట్, మద్దూర్‌ నగర్, వెంకటరమణ కాలనీల్లో ఎక్కువ శాతం వ్యాపార దుకాణాలున్నాయి. ఇక్కడ ఏ వస్తువు కొనుగోలు చేసినా.. ప్లాస్టిక్‌ కవర్లలో నింపి ఇస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించవద్దని నగర పాలక సంస్థ సిబ్బంది కొన్ని రోజులు అవగాహన కల్పించారు. నిషేధం అమలులో నిర్లక్ష్యం వహించడంతో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా మురుగు కాల్వలు, చెత్త కుండీల్లో ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిస్తున్నాయి. కాల్వల్లో పేరుకుపోయి వర్షం నీరు వెళ్లేందుకు వీలులేకుండా పోతోంది. రోడ్లపై కాలనీల్లో నిల్వ ఉంటున్నాయి.
ఈ వస్తువుల నుంచి ఎక్కువ శాతం: నగరంలో ఒక్క రోజుకు 30 వేల వరకు టీకప్పులు, ఒకసారి వాడిపారేసే గ్లాసులు, మరో 20 వేల వరకు ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు, 2 వేల వరకు నీళ్ల బాటిళ్లు వినియోగిస్తున్నట్లు అంచనా. బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, షాంపులు తదితర వస్తువులు సంచుల్లోనే లభ్యమవుతున్నాయి. ఇలా.. రోజుకు భారీ స్థాయిలో వ్యర్థాలు ఆయా ప్రాంతాల్లో పేరుకుపోతున్నాయి. వ్యర్థాలతో మురుగు కాల్వలు పూడిపోతున్నాయి. ప్లాస్టిక్‌ వస్తువులు నదులు, చెరువులు, కుంటల్లో కలిసి పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్నాయి. 
మార్పు ఎవరిలో రావాలి: ప్లాస్టిక్‌ నిషేధం కట్టుదిట్టంగా అమలు కావాలంటే ప్రజలు చైతన్యవంతులవ్వాలి. కూరగాయల మార్కెట్, తదితర దుకాణాలకు వెళ్లే ముందు ఇంటి నుంచి చేతిసంచులు, జ్యూట్‌్ బ్యాగులు తీసుకెళ్లాలి. దుకాణదారులు సైతం వినియోగదారులకు సహకరించకుంటే తమ వ్యాపారంలో ఎక్కడ నష్టం వస్తుందోనని చాటుమాటుగా ప్లాస్టిక్‌ సంచులను విక్రయిస్తున్నారు. నగర పాలక అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. చూసీచూడనట్లు ఉండకుండా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారిపై జరిమానాలు విధించాలి. 
నగర విస్తీర్ణం : 69.51 చ.కి.మీ
నగర జనాభా : 6 లక్షలు
మొత్తం డివిజన్లు: 8 
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు: 12
రోజు ఉత్పత్తి అయ్యే 
వ్యర్థాలు: 10 టన్నులు 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.