close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకలి డొక్కలకు సర్వర్‌ కష్టాలు

రెండో రోజూ మొరాయింపు

కార్డుదారులకు తప్పని అవస్థలు

వెల్దుర్తిలో ఓ దుకాణం వద్ద వేచి ఉన్న కార్డుదారులు

పత్తికొండ నాలుగుస్తంభాల కూడలి, డోన్‌ పట్టణం, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు చౌకదుకాణాల ద్వారా మంగళవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచే కార్డుదారులకు ఈ పాస్‌ యంత్రాల ద్వారా రేషన్‌ అందజేసేందుకు డీలర్లు ప్రయత్నించినా తరచూ సర్వర్‌ మొరాయిస్తూనే ఉంది. కార్డుదారులు చౌకదుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రెండో రోజు బుధవారం ఇదే పరిస్థితి తలెత్తడం గమనార్హం.

తరచూ సాంకేతిక సమస్యలు

జిల్లాలో 2,436 చౌకదుకాణాలకు గాను 12,13,716 రేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లాలోని చౌకదుకాణాల వద్ద ఈపాస్‌ సర్వర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండంటంతో డీలర్లు అవస్థలు పడుతున్నారు. ఒక్కో కార్డుదారుడికి అరగంటకు పైగానే సమయం తీసుకుంటోంది. చివరలో ప్రింటింగ్‌ వచ్చే సమయంలోనూ సర్వర్‌ సతాయిస్తుండటం మరీ మొదటికే మోసం జరుగుతోందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విజృంభిస్తోన్న నేపథ్యంలో గంటల తరబడి కార్డుదారులు వేచి ఉండాల్సి వస్తుండటంతో.. ఎక్కడ కరోనాకు గురి కావాల్సి వస్తోందని అటు కార్డుదారులు ఇటు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 154 మంది దుకాణాలు తెరవలేదు. డీఎస్‌వోకు, సీఎస్‌డీటీ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈకేవైసీ నమోదుకూ ఇబ్బందులే..

ఈకేవైసీ నమోదు చేసేందుకు గడువు దగ్గర పడటంతో వాలంటీర్లు రేషన్‌కార్డు దారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వివరాలను నమోదు చేయడం, కొత్త కార్డులు, కార్డుల్లో అదనంగా పేర్లను నమోదై వచ్చిన కార్డులను పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో సర్వర్‌పై భారం పడి ఈపాస్‌ సర్వర్‌లో సాంకేతిక సమస్య తీవ్రమైంది. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో దయనీయంగా మారింది. రెండు రోజులకు గాను 24.18 శాతం మందికి రేషన్‌ బియ్యాన్ని అందించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి ఈపాస్‌ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, సరకులను త్వరగా అందజేయాలని కార్డుదారులు కోరుతున్నారు.

గంటల కొద్దీ నిరీక్షణ

- జింక లక్ష్మీదేవి, ఎస్‌.వలసల

ఉచిత బియ్యం కోసం చౌకదుకాణం వద్దకు వెళ్లాం. యంత్రం సరిగా పని చేయకపోవడంతో దుకాణం వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. పొలం పనులను వదిలి బియ్యం కోసం వెళ్లి పడిగాపులు కాయాల్సి వస్తోంది.

సర్వర్‌ సమస్యతో జాప్యం ఏర్పడింది

- పద్మశ్రీ, డీఎస్‌వో

రేషన్‌ పంపిణీకి సంబంధించి బుధవారం మధ్యాహ్నం వరకు సర్వర్‌ సమస్యతో పాటు ఈ పోస్‌ యంత్రానికి సిగ్నల్స్‌ సరిగా అందకపోవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో చౌకదుకాణాలు బాగా పనిచేశాయి. 2.93 లక్షల మంది కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.