close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజీ లేని పోరాటం

సేవల్లో తలమునకలైన అధికారులు ●

నేడు పురస్కారాల ప్రదానం


డీఎస్పీ వినోద్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి స్వాతంత్య్ర పోరాటం చేపట్టాం. ప్రస్తుతం కరోనా వైరస్‌ను తిప్పికొట్టడానికి రాజీలేని పోరాటం చేస్తున్నాం. కొవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది చెమటోడ్చుతున్నారు. ఉద్ధృతిని కట్టడి చేయడానికి రెవెన్యూ, పోలీసు ఇలా ప్రతి శాఖ అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. అందుకే ఈ స్వాతంత్య్ర దిన వేడుకల్లో కొవిడ్‌ వారియర్లకు అవార్డులందజేయనున్నారు.

*కొవిడ్‌-19 సేవల్లో పాల్గొన్న 86 మంది వర్టికల్‌ అధికారులకు, వైద్య, పారిశుద్ధ్య, రెవెన్యూ, పోలీసు అధికారులు 37 మందికి కలిపి మొత్తం 123 మందికి నేడు పోలీస్‌ కవాతు మైదానంలో అవార్డులు ప్రకటించనున్నారు. కరోనా దృష్ట్యా కేవలం ఐదు మందికి మాత్రమే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

కొవిడ్‌ కట్టడి, నియంత్రణ బాధ్యతల్లో

కర్నూలు సీసీఎస్‌లో పనిచేసిన డీఎస్పీ వినోద్‌కుమార్‌ లాక్‌డౌన్‌ సమయంలో కర్నూలులో విధులు నిర్వహించారు. లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేయడంలో గుర్తింపు పొందారు. ఆ తర్వాత అంతర్‌రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద పర్యవేక్షణ బాధ్యతలు చూశారు. అలంపూర్‌ చెక్‌పోస్టు వద్ద పాసుల తనిఖీలు, ప్రయాణికులకు స్వాబ్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు సక్రమంగా అమలయ్యేలా చూశారు. ప్రస్తుతం ఆదోని ఇన్‌ఛార్జి డీఎస్పీగా బాధ్యతలు చూస్తున్నారు. ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు.

రాష్ట్రంలో తొలి ప్రయోగం

నగరపాలక సంస్థ కమిషనరుగా మే 2న బాధ్యతలు తీసుకున్నాను. తొలి రోజు నుంచే కొవిడ్‌ విధుల్లో పాల్గొన్నాను. కొవిడ్‌ పరీక్షలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరించేలా చేశాను. ఇలా పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు చేయడంలో రాష్ట్రంలోనే కర్నూలు తొలి ప్రయోగం చేసినట్లైంది. నగరంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలయ్యేలా చూస్తున్నాం. కర్నూలులో దీర్ఘకాలిక సమస్యలుండి కరోనా బారిన పడిన వృద్ధులు 48 శాతం మంది ఉన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యవసరమైతే జీజీహెచ్‌లో పడకలు కేటాయించేలా చూస్తున్నాం. సీఎస్‌ఆర్‌ కింద పల్స్‌ ఆక్సీమీటర్లు (ఆక్సిజన్‌ స్థాయి చూపే పరికరం) 3 వేలు కొనుగోలు చేసి వాలంటీర్లకు అందజేశాం. బ్లీచింగ్‌, హైపో ద్రావణంతో శానిటైజేషన్‌ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో 180 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి వీధులు శుభ్రం చేయిస్తున్నాం. - డీకే బాలాజీ, నగరపాలక సంస్థ కమిషనర్‌

నా వంతు బాధ్యత తీసుకున్నా

జేసీ-2గా మే 17న బాధ్యతలు తీసుకున్న వెంటనే కరోనా విధుల్లో పాల్గొన్నాను. రక్తనమూనాల సేకరణ, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ల్యాబ్‌లపై పర్యవేక్షణ బాధ్యత నావంతుగా తీసుకున్నా. ప్రతి రోజూ 7 వేల పరీక్షలు చేసే స్థాయికి వెళ్లడం అంత సులువు కాదు. నాకు తెలిసి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందితే తక్షణమే కోలుకుంటారు. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా వచ్చింది. జలుబు, జ్వరం వచ్చి పోయాయని, ఎలా చెప్పుకున్నామో? కరోనా వచ్చినా అంతే చెప్పుకోవాలి. పక్కింటి వాళ్లకు వచ్చిందని వివక్ష చూపొద్ధు నా దాకా రాదనేది వద్ధు అత్యవసరమైతేనే బయటకు రావాలి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. లేదంటే మీరే స్ప్రెడ్డర్స్‌గా (వ్యాప్తిచేసే) మారి మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు, పిల్లలను ఇబ్బంది పెట్టిన వారవుతారు. - రాంసుందర్‌రెడ్డి, జేసీ-2​​​​​​​

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కేసులను నయం చేశాం

గతంలో ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో పనిచేసే నాకు రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి పర్యవేక్షకునిగా బాధ్యతలు మే 4న అప్పగించారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో చికిత్స పొందిన వారి సంఖ్య 2,500 దాటి పోయింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కొవిడ్‌ బారిన పడిన కేసులనే రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్చుకున్నాం. అడ్మిషన్లు, పరీక్షలు, రోగుల ఆరోగ్యం ఆరా తీస్తూ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటున్నాను. క్లిష్టస్థితిలో వచ్చిన 800 కేసులను మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వెళ్లేలా చేశాం. - నరేంద్రనాథ్‌రెడ్డి, జీజీహెచ్‌ పర్యవేక్షకులు​​​​​​​

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.