close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజలకు మెరుగైన వైద్యసేవలందాలి

● వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నంద్యాలలో ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి

ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి.. నంద్యాల నుంచి పాల్గొన్న

ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీలు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల వల్ల ప్రజలకు మెరుగైన వైద్యమందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. నంద్యాలలోని ఉదయానంద ఆసుపత్రిని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, జిల్లా ఎస్పీ డా.ఫక్కీరప్ప, నంద్యాల సబ్‌కలెక్టర్‌ కల్పనా కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. త్వరలో నంద్యాలలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆర్థర్‌, ఆసుపత్రి డైరెక్టర్లు, వైద్యులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ తరగతులకు ఫీజులు వసూలు చేయొద్దు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల నిర్వాహకులు ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో ఫీజులు అధికంగా వసూలు చేసినా, బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోయినా రెగ్యులర్‌ మోనిటరింగ్‌ కమిషనర్‌ ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో ఆర్‌.సాలాబాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రస్థాయిలో 91503 81111, జిల్లాస్థాయిలో 08518 222047 సహాయ కేంద్రాలను సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.