close

బుధవారం, అక్టోబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పత్తిపై గులాబీ కత్తి

కర్నూలులో పురుగు దాడి

పరిశీలించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

రాష్ట్రంలోనే అత్యధికంగా 6.33 లక్షల ఎకరాల్లో సాగు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

పత్తి పంటలను పరిశీలిస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

పత్తిపై గులాబీ పురుగు కత్తి పెట్టి కూర్చుంది. ఇప్పటికే వందల ఎకరాల్లో దాడి మొదలైంది. శాస్త్రవేత్తలు సైతం జిల్లాలోని కొన్ని డివిజన్లలో పరిశీలించి గులాబీ పురుగును గుర్తించారు. అక్టోబర్‌, నవంబరు, డిసెంబరు నెలల్లో దీని ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈనెల 19న శనివారం వ్యవసాయాధికారులకు అవగాహన కల్పించేలా జూమ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు 2,33,933 హెక్టార్లు కాగా, ప్రస్తుతం 2,53,444 హెక్టార్లలో సాగైంది. అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా 6.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన జిల్లాగా నిలిచింది. జూన్‌ మొదటి వారంలో పత్తి సాగు చేసిన రైతులకు ఈ గులాబీ రంగు పురుగు దాడి తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మరో పది రోజుల్లో తొలి కోత కోసేస్తారు. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో ఆలస్యంగా సాగు చేసిన రైతులకు కాయ పగిలే సరికి డిసెంబరు, జనవరి పడుతుంది. ఈ పొలాలపై గులాబీ దాడి ఉద్ధృతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదనంగా ఖర్చు పెడుతున్నా...

పత్తికి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చు వస్తుందని కర్షకులు చెబుతున్నారు. గులాబీ రంగు పురుగు నుంచి పంటను కాపాడటానికి ముందస్తుగా రూ.7 వేల వరకు అదనంగా మందుల పిచికారీకి ఖర్చు చేస్తున్నారు. అయినా పూతలోంచి పిందెకు పురుగు పాకుతోంది. ఇప్పటికే జిల్లాలో 2 వేల హెక్టార్లలో పురుగు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇలా రైతులకు కంటి మీద కునుకు లేకుండా పింక్‌ బౌల్‌ దాడి చేస్తోంది. దీనికితోడు అధిక వర్షాలతో జిల్లాలో పది వేల హెక్టార్ల పైగా పంటకు నష్టం వాటిల్లింది.

పురుగును గుర్తించి...

జిల్లాలో పత్తి సాగు చేసిన నందికొట్కూరు, ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో తొలిగా సాగు చేసిన, ఆలస్యంగా వేసిన పంటలను నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ పరిశీలనలో గులాబీ పురుగు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అంత ఉద్ధృతి లేదని, వచ్చే రెండు నెలలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు అంచనాకు వచ్చారు. పత్తిలో గులాబీ పురుగు ఉనికి చాటుతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయ సహకారంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో మండల స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులకు, 23వ తేదీ నుంచి అక్టోబర్‌ 7 వరకు రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు.

ప్రణాళికగా మందుల పిచికారీ

రైతులు ప్రణాళికగా మందులు పిచికారీ చేసుకుంటే నష్టాన్ని కొంత ఆపవచ్చని ఆర్‌ఏఆర్‌ఎస్‌ పత్తి శాస్త్రవేత్త రామారెడ్డి, పత్తి కీటక శాస్త్రవేత్త ఎం.శివరామకృష్ణ తెలిపారు. ఎకరా పత్తిలో అయిదు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి రోజుకు పది చొప్పున మూడు రోజులపాటు పల్లె రెక్కల పురుగులు పడినట్లు గుర్తిస్తే ఉద్ధృతి పెరుగుతుందని గుర్తించాలన్నారు. వేప నూనెతో మొదలు పెట్టి లీటరు నీటికి 5 మి.లీ. నూనె కలిపి పిచికారీ చేయాలన్నారు. పది..పది రోజుల వ్యవధిలో క్లోరోఫైరీపాస్‌ లీటరు నీటిలో 2.5 మి.లీ., ప్రొఫెనోపాస్‌ లీటరు నీటికి 2 మి.లీ., థయోడి కార్బ్‌ 1.5 మి.లీ. చొప్పున పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నారు. పొలంలో గడ్డి పూలు వేరేసి నాశనం చేయాలని చెబుతున్నారు.

ముందస్తు వేసిన పంటలోనూ పురుగు దాడి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.