close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊళ్ళు జలమయం

 జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు

26 వేల హెక్టార్లలో పంట నష్టం

 

హొళగుందలో పూర్తిగా దెబ్బతిన్న పత్తి పైరు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నింగికి చిల్లు పడినట్లు నిత్యం వానలు కురుస్తూనే ఉన్నాయి. అతివృష్టి వల్ల జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. మరోవైపు పలు గ్రామాలు జలమయమయ్యాయి. జిల్లాలో 26 మండలాల్లో 221 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా నివేదికలు సిద్ధం చేశారు. అత్యధికంగా ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో 9,926 హెక్టార్లు, నంద్యాల డివిజన్‌లో 4,378 హె, నందికొట్కూరు డివిజన్‌లో 7,949, ఆళ్లగడ్డ 2,933, కోవెలకుంట్ల 1,289, ఆదోని 178, డోన్‌ 172, కర్నూలు పరిధిలో 71 హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అత్యధికంగా మొక్కజొన్న 11,141 హెక్టార్లలో దెబ్బతింది. మొత్తం 26,896 హెక్టార్లలో పంట దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా 18,806 మంది రైతులకు సంబంధించి రూ.36.65 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేసి నివేదికలు రూపొందించారని, కలెక్టర్‌ ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నివేదికలు పంపినట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ శనివారం తెలిపారు.

5,852 ఇళ్లలోకి నీరు

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 362 గ్రామాల్లో నష్టం వాటిల్లింది. 5,852 ఇళ్లల్లోకి వర్షం నీరు చేరి ముంపునకు గురయ్యాయి. నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. కర్నూలు డివిజన్‌లో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. నంద్యాల డివిజన్‌లో 1,576 ఇళ్లు, కర్నూలు డివిజన్‌లో 4,276 ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. నంద్యాల డివిజన్‌లో 723, కర్నూలు డివిజన్‌లో 722, ఆదోని డివిజన్‌లో 95 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

జిల్లాలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఫలితంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. బనగానపల్లి మండలంలో అత్యధికంగా 11.9 సెంటీమీటర్లు కురిసింది. బేతంచెర్లలో 9 సెం.మీ.లు, రుద్రవరం 88.6 మి.మీ.లు, నందికొట్కూరు 85.2, శిరువెళ్ల 83.6, మహానంది 69.4, నంద్యాల 65.2, గోస్పాడు 62.8, ఆళ్లగడ్డ 62.4, కొలిమిగుండ్ల 58.4, సంజామలలో 55.8 మి.మీ.లు పడింది. కర్నూలులో 53.6, దొర్నిపాడు 53.4, కల్లూరు 52.6, వెలుగోడు 51.2, ఓర్వకల్లు 50.2, మిడుతూరు 47.6, అవుకు 47.4, శ్రీశైలం 44.2.. అత్యల్పంగా హాలహర్వి, మద్దికెర 6.2, హొళగుందలో 4.2 మి.మీ.లు.. మొత్తం 54 మండలాల్లో 1,949.6 మిల్లీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. జిల్లా సగటున ఒక్కరోజే 36.1 మి.మీ.లు నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ.లు కాగా ఇప్పటివరకు 203.2 మి.మీ. పడింది.

 

కర్నూలు సంతోష్‌నగర్‌ వద్ద జలమయమైన కార్ల షోరూం

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.