close

మంగళవారం, జులై 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రాల హక్కులను హరించడం తగదు

ప్లకార్డులతో సీపీఎం నాయకుల నిరసన

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే : విద్యుత్తు రంగంలో రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శిజబ్బార్‌ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్తు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించాలని డిమాండు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి 24 లక్షల విద్యుత్తు కనెక్షన్లు, 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వినియోగదాల కనెక్షన్లు 70 లక్షలు ఉన్నాయని, విద్యుత్తు సవరణ బిల్లుతో ఆయా వర్గాల ప్రజలపై పెనుభారం పడనుందన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్తు సవరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. నాయకులు ఆంజనేయులు, గోపాలకృష్ణ, కురుమయ్య, పరమేశ్వరాచారి, బీసన్న, రాజశేఖర్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

వీపనగండ్ల : విద్యుత్తు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం వీపనగండ్లలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వ్యవస్థనను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. నాయకులు మురళి, వెంకటేశ్వర్‌గౌడు, ఆంజనేయులు, ఈశ్వర్‌, నాగరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

పాన్‌గల్‌ : విద్యుత్తు సవరణ బిల్లుతో రైతులు, పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో పాన్‌గల్‌, రేమద్దుల గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వేణుగోపాల్‌, నాయకులు కోదండరాములు, వెంకటయ్య, బాలచంద్రి పాల్గొన్నారు.

అమరచింత : కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్ట సవరణ బిల్లును ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట సీపీఎం నాయకులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. జిల్లా నాయకులు గోపి, రమేశ్‌, అజయ్‌, బుచ్చన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘు, రాఘవేంద్ర, విజయ్‌, శ్యాంసుందర్‌, పాల్గొన్నారు.

వనపర్తి పట్టణం : విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పుట్టా ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

ఆత్మకూరు : ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలో సీపీఎం కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు పి శ్రీహరి, రవీందర్‌, బాలరాజు, బాల్‌హామ్మద్‌, పీతాంబర్‌రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.